ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగితే.. పిల్లలు పుట్టడం కష్టమే

|

Mar 03, 2024 | 5:13 PM

నానో ప్లాస్టిక్స్ అంటే అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు. కంటికి ఏ మాత్రం కనిపించకుండా నీటిలో కరిగిపోయే ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వల్ల తీవ్ర మైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రక్తంలో సులువుగా కలిసిపోతాయి. మన అవయవాలను, రోగనిరోధక శక్తిని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. గుండెకు కూడా ఈ నానోప్లాస్టిక్ రేణువుల వల్ల ముప్పుందన్నది వైద్యుల హెచ్చరిక. నిజానికి నిన్న మొన్నటి వరకు ఈ దిశగా పరిశోధనలు పెద్దగా జరగలేదు.

నానో ప్లాస్టిక్స్ అంటే అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు. కంటికి ఏ మాత్రం కనిపించకుండా నీటిలో కరిగిపోయే ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వల్ల తీవ్ర మైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రక్తంలో సులువుగా కలిసిపోతాయి. మన అవయవాలను, రోగనిరోధక శక్తిని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. గుండెకు కూడా ఈ నానోప్లాస్టిక్ రేణువుల వల్ల ముప్పుందన్నది వైద్యుల హెచ్చరిక. నిజానికి నిన్న మొన్నటి వరకు ఈ దిశగా పరిశోధనలు పెద్దగా జరగలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల వినియోగంతో ఆ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. అందులో భాగంగా అమెరికాలోని 3 ప్రముఖ కంపెనీల వాటర్ బాటిళ్లలోని నీటిని పరిశీలించినప్పుడు ఈ వాస్తవాలు బయటపడ్డాయి. సాధారణంగా ఓ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తయారీనికి 1.5 నుంచి 3 లీటర్ల నీటిని అలాగే సుమారు పావు లీటర్ క్రూడాయిల్‌ను వినియోగిస్తారు. వాటితో పాటు మైక్రో ప్లాస్టిక్ పొడి కూడా కలుపుతారు. ఈ సూక్ష్మమైన పొడి రేణువులతో కూడిన బాటిల్లో నీటిని నిల్వ చేస్తే చాలా సులభంగా ఆ పొడిలోని నానో ప్లాస్టిక్ రేణువులు నీటిలో కలిసిపోతాయి. ముఖ్యంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఈ ప్రక్రియ మరింత సులభంగా జరిగిపోతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్యంత అరుదైన వాకింగ్‌ ఫిష్.. చిలీ సముద్ర జలాల్లో

ఒకప్పటి టాప్‌ విలన్‌ అజిత్‌.. జీవితం దుర్భరం.. కారణం వారే

కాణిపాకం వినాయకుడికి 6 కేజీల బంగారు బిస్కెట్ల విరాళం

కుమారుడి పెళ్లికి వచ్చే అతిథులకు నీతా ఆంబానీ స్పెషల్‌ మెసేజ్‌

పేటీఎం బ్యాంకు కార్యకలాపాల నిలిపివేతకు డెడ్‌లైన్ మార్చి 15

 

Follow us on