హైదరాబాద్‌లో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు

Updated on: Jan 31, 2025 | 9:22 PM

మహారాష్ట్రలో ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ హైదరాబాద్‌లో ఎంటరయింది. నగరంలో తొలి కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే వందకుపైగా జీబీఎస్ కేసులు నమోదయ్యాయి.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సిండ్రోమ్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. గులియన్-బారే సిండ్రోమ్ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పై దాడి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. జీబీఎస్ సోకిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపిస్తుంది. కండరాలు బలహీనంగా మారి, పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయి. డయేరియా, పొత్తికడుపులో నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. అయితే, ఇది అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం అవుతుందని వివరించారు. ప్రమాదకరమైన గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి దేశ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మెల్లిమెల్లిగా అందరికీ సోకుతూ ప్రాణాలను బలి తీసుకుంటోంది. పశ్చిమ బెంగాల్‌లోనూ గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారితో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బడ్జెట్ తరువాత బంగారం ధర పెరుగుతుందా ?? తగ్గుతుందా ??

ఇంట్లోకి చొరబడి.. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి! హీరోకు షాకిచ్చిన ఆగంతకుడు

విషాదంలో రాణా !! కన్నీళ్లతో పాడె మోసిన హీరో

పద్మ అవార్డ్‌ ఏమో కానీ.. ఈ స్టార్స్ మధ్య గొడవ షురూ

పాపకు ప్రాణం పోసే సాయం !! గొప్ప మనసు చాటుకున్న తేజ్‌