ఎయిర్ పోర్టులో చాక్లెట్ల మధ్యలో బంగారాన్ని తరలిస్తున్న వైనం
విదేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని అక్రమంగా తరలించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.
విదేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని అక్రమంగా తరలించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే దుబాయ్ నుంచి ఇండియాకు వస్తున్న ఇద్దరు ప్రయాణికులు తెలివిగా బంగారాన్ని తరలించేందుకు యత్నించారు. అనుమానంతో వాళ్లని గమనించిన కస్టమ్స్ అధికారులు వాళ్ల బ్యాగులు తనిఖీ చేశారు. అయితే చాక్లెట్ల మధ్యలో 13 ముక్కలుగా అమర్చిన బంగారాన్ని గుర్తించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shraddha Das: అప్పుడు నవ్వించావు.. ఇప్పుడు ఏడిపిస్తున్నావు..
Baby Song: మెలోడీతో మ్యాజిక్ చేస్తున్న సాంగ్.. 10 మిలియన్ రికార్డ్
వైరల్ వీడియోలు
Latest Videos