Future Crime Summit 2024: ఢిల్లీలో ఫ్యూచర్ క్రైం సమ్మిట్ 2024.! డిజిటల్ క్రైం అరికట్టడంపై చర్చ.

|

Feb 10, 2024 | 6:09 PM

డిజిటల్ క్రైం, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్‌తో పాటు ఆర్థిక నేరాలు.. ఇవి రోజు రోజుకీ దేశంలో పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేడమే లక్ష్యంగా ఐఐటీ కాన్పూర్‌ AIIDE సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ది ఫ్యూటర్ క్రైం రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఢిల్లీలోని లోధీ రోడ్‌లో ఓ సదస్సు జరుగుతోంది. పిబ్రవరి 8-9 తేదీలలో జరిగే ఈ సదస్సుకు కేంద్ర హోం శాఖ స్పెషల్ సెక్రటరీ సుందరీ నందా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డిజిటల్ క్రైం, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్‌తో పాటు ఆర్థిక నేరాలు.. ఇవి రోజు రోజుకీ దేశంలో పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేడమే లక్ష్యంగా ఐఐటీ కాన్పూర్‌ AIIDE సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ది ఫ్యూటర్ క్రైం రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఢిల్లీలోని లోధీ రోడ్‌లో ఓ సదస్సు జరుగుతోంది. పిబ్రవరి 8-9 తేదీలలో జరిగే ఈ సదస్సుకు కేంద్ర హోం శాఖ స్పెషల్ సెక్రటరీ సుందరీ నందా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రక్షణ శాఖ ముఖ్య సలహాదారు లెఫ్ఠెనెంట్ జనరల్ వినోద్ జి ఖండారే, నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ లెఫ్ట్ నెంట్ జనరల్ ఎం.యు.నాయర్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన మాజీ డీజీపీలు, ఇతర ఐపీఎస్ అధికారులు, ఐఐటీ కాన్పూర్ సీఈఓ ఈ సదస్సులో ముఖ్య వక్తలుగా వ్యవహరిస్తున్నారు.

భద్రతతో కూడిన డిజిటల్ భవిష్యత్తే ఈ సదస్సు ప్రధాన ఉద్ధేశం. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, లీగల్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన వివిధ ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ రంగాలలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలపై ఈ సదస్సు ప్రధానంగా చర్చించనుంది. వాటితో పాటు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డీప్ ఫేక్ నేరాలు, క్రిప్టో క్రైమ్స్, బ్లాక్ చైన్ నేరాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలు కూడా రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా క్రిమినల్ మెథడాలజీ గురించి అలాగే ఈ నేరాల సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం గురించి ఈ సమావేశానికి హాజరయ్యే వారికి వక్తలు వివరించనున్నారు. ఈ సదస్సు పూర్తిగా సృజనాత్మకంగా సాగనుంది. ముఖ్యంగా సైబర్ క్రైం రంగంలో ఉన్న ప్రొఫెషనల్స్‌కి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..