బాటిళ్లతో టైం బాంబులు.. ఆర్డర్‌ చేసిన మహిళ అరెస్టు

|

Feb 21, 2024 | 1:32 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో బాటిల్ లో టైమ్‌ బాంబులు తయారు చేసిన ఘటనలో ఓ మహిళతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల వివరాల ప్రకారం బాటిళ్లలో ఇనుప గుండ్లు, పేలుడు పదార్థాలను నింపి తయారుచేసిన టైం బాంబులను డెలివరీ ఇచ్చేందుకు వెళ్తుండగా జావెద్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇమ్రానా అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో బాటిల్ లో టైమ్‌ బాంబులు తయారు చేసిన ఘటనలో ఓ మహిళతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల వివరాల ప్రకారం బాటిళ్లలో ఇనుప గుండ్లు, పేలుడు పదార్థాలను నింపి తయారుచేసిన టైం బాంబులను డెలివరీ ఇచ్చేందుకు వెళ్తుండగా జావెద్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇమ్రానా అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రానాను విచారించగా.. 2013లో జరిగిన మత ఘర్షణల్లో తన ఇల్లు ధ్వంసమైందని.. మళ్లీ అలాంటి ఘటనలు చెలరేగితే బాంబులు కావాలనే ఉద్దేశంతో తయారు చేయించినట్లు విచారణలో చెప్పింది. గతంలోనూ ఇలాంటి బాంబులను తన ఇంట్లో ఉంచానని.. తర్వాత వాటిని ఇతరులకు అందజేసినట్లు ఇమ్రానా అంగీకరించింది. కేసులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా ఆ బాంబులను న్యాజుపురా అటవీ ప్రాంతంలో నిర్వీర్యం చేసారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏటీఎంలో చోరీ.. లక్షలు దోచేసిన కేటుగాళ్లు..

ఎగురుతున్న విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన

పెళ్లికోసం యువకుడి తిప్పలు.. ఏం చేశాడంటే ??

ఆరోగ్యానికి సంజీవని ఈ గింజలు.. మహిళలకు అంతకుమించి

కోతుల బెడదకు మహిళ ఉపాయం.. రూ.2000తో..