Loading video

క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..

|

Mar 27, 2025 | 8:51 AM

రక్షణ, వ్యవసాయ, వైద్య రంగాల్లో డ్రోన్లు విజయవంతం అవ్వడంతో ఎయిర్ టాక్సీల తయారీపై ఔత్సాహికవేత్తలు దృష్టి సారించారు. హెలికాఫ్టర్, విమానం అంత టెక్నాలజీ అవసరం లేకుండానే సులభంగా అకాశంలో ప్రయాణించే ఎయిర్ టాక్సీలు ప్రయోగదశను దాటి ఉత్పత్తి స్థాయికి చేరుకున్నాయి. అయితే కేంద్ర అనుమతులు వచ్చిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గుంటూరు స్థంభాలగరువుకు చెందిన అభిరామ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం చేశారు. అయితే డ్రోన్ల ప్రయోగాలు జరుగుతున్న సమయంలోనే తాను ఎయిర్ టాక్సీ తయారు చేయాలన్న సంకల్పంతో 2017లో మాగ్నమ్ వింగ్స్ కంపెనీని స్థాపించారు. అప్పటి నుంచి ఇండియాలోనే ఎయిర్ టాక్సీల తయారీ కోసం శ్రమిస్తున్నారు. అయితే వీరి శ్రమకు తగ్గట్లుగానే వి2 మోడల్ ఎయిర్ టాక్సీ ప్రయోగదశను దాటి ప్రయాణీకుల చెంతకు చేరేందుకు సిద్దమైంది. ఈ వి2 మోడల్‌లో ఇద్దరు ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. ఎత్తైన భవనంపై నుంచి అకాశంలోకి ఎగిరే ఎయిర్ టాక్సీ నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే కేంద్రం ఇంకా ఎయిర్ టాక్సీ విధానంపై రూపొందిస్తున్న పాలసీ ఇంకా డ్రాప్ట్ దశలోనే ఉంది. దీంతో కేంద్రం ఎయిర్ టాక్సీ పాలసీని రూపొందించి అన్ని అనుమతులు తీసుకోవడానికి ఇంకా సమయం పడుతుందంటున్నారు అభిరామ్. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు అభిరామ్ చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం :

క్యాబ్‌ ఖర్చుతోనే గాల్లో ప్రయాణం.. ఎయిర్‌ ట్యాక్సీ మేడ్‌ ఇన్‌ గుంటూరు

పాములు వాళ్లపైనే.. ఎందుకు పగ పడుతున్నాయి?

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో