Crime: ఢిల్లీలో CID ని మించిన క్రైమ్ థ్రిల్లర్ సీన్..! ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు.. పోలీసులకే చుక్కలు. చివరికి ఇలా..
బుల్లితెరపై ప్రసారమయ్యే సీఐడీ సీరియల్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ ను చిన్నారులనుంచి వృద్ధుల వరకూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అచ్చం అలాంటి సీన్ ఒకటి ఉత్తరప్రదేశ్‌లో రియల్‌గా జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నోయిడాకు చెందిన పాయల్ భాటి అనే 22 రెండేళ్ల యువతి, తన ప్రియుడు అజయ్ ఠాకూర్‌తో కలిసి.. అచ్చం పాయల్ పోలికలతో ఉండే అమ్మాయితో స్నేహం చేశారు. హేమ అనే ఈ అమ్మాయి స్థానికంగా ఉండే ఓ మాల్‌లో పనిచేస్తుంది. పథకం ప్రకారం పాయల్, హేమను ఇంటికి పిలిచింది. అనంతరం ప్రియుడితో కలిసి ఆమె గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఆమె ముఖం, గొంతుపై వేడి నూనె పోసింది. ఆతర్వాత హేమ మృతదేహానికి పాయల్ బట్టలు వేసారు. అనంతరం తనే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తూ.. ‘వంట చేస్తుండగా.. నా ముఖం కాలిపోయింది. నాకింక బతకాలని లేదు’ అంటూ ఓ సూసైడ్ నోట్ రాసి అక్కడ పెట్టి, ప్రియుడితో కలిసి పారిపోయింది. సూసైడ్ నోట్ చూసి చనిపోయింది పాయలే అని భావించిన ఆమె బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు.. చనిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదంటూ నవంబర్ 12న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరిని అరెస్టు చేశారు. పాయల్ తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారని, ‘తన తల్లిదండ్రుల మరణానికి సోదరుడి అత్తింటివారితోపాటు ఓ బంధువు కారణమని భావించిన పాయల్ వారిని చంపేందుకు ఇంతటి స్కెచ్ వేసిందని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం.. ముందుగా తను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది. తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయింది. అనంతరం వారిని హత్య చేసేందుకు.. నాటు తుపాకీ, కత్తి సైతం కొనుగోలు చేశారు’ అని పోలీసులు వెల్లడించారు. మారణాయుధాలనూ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..