Bill Gates Dance: బిల్‌గేట్స్‌ డాన్స్‌ చేయడం ఎప్పుడైనా చూసారా..? వైరల్‌ అవుతున్న రేర్‌ వీడియో..

Bill Gates Dance: బిల్‌గేట్స్‌ డాన్స్‌ చేయడం ఎప్పుడైనా చూసారా..? వైరల్‌ అవుతున్న రేర్‌ వీడియో..

Anil kumar poka

|

Updated on: Dec 09, 2022 | 6:20 PM

సాధారణంగా ఏదైనా ఈవెంట్‌ జరుగుతున్నప్పుడు అతిథులంతా హ్యాపీగా గడుపుతూ డాన్స్‌ చేస్తారు. ఇందుకు చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా ఉండదు. జీవితంలో తాము అనుకున్నది సాధించినప్పుడు కలిగే ఆనందాన్ని ఒక్కొక్కరూ


సాధారణంగా ఏదైనా ఈవెంట్‌ జరుగుతున్నప్పుడు అతిథులంతా హ్యాపీగా గడుపుతూ డాన్స్‌ చేస్తారు. ఇందుకు చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా ఉండదు. జీవితంలో తాము అనుకున్నది సాధించినప్పుడు కలిగే ఆనందాన్ని ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వ్యక్తం చేస్తారు. అలాగే ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ కూడా తన ఆనందాన్ని డాన్స్‌ రూపంలో వ్యక్తం చేశారు. 1995లో మైక్రోసాఫ్ట్ విండోస్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్ గేట్స్ ఫుల్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.మైక్రోసాఫ్ట్ విండోస్ 1995 లాంచ్ పార్టీ అనే టైటిల్‌తో ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో బిల్ గేట్స్ స్టేజ్‌పై ఇతరులతో కలిసి డ్యాన్స్ చేయడమే కాదు, అక్కడ ప్లే అవుతున్న పాటకు లిప్ సింక్ కూడా చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోను దాదాపు ఆరు మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. లాస్ట్‌ ఇన్ హిస్టరీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్‌ చేశారు. ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ విండోస్ లాంచ్ పార్టీలో మైక్రోసాఫ్ట్ మాజీ CEO స్టీవ్ బాల్మెర్‌తో కలిసి వేదికపై ఉత్సాహంగా గ్రూటింగ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చారిత్రాత్మక ఘట్టం అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 09, 2022 06:20 PM