అతిగా ఆందోళన చెందడం కూడా అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. ఈ విషయం తెలిసినా కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే చింతిస్తూ రోజులు గడుపుతుంటారు. ఎక్కువగా ఆందోళన చెందే అమ్మాయిలు తమ వయస్సు కంటే పెద్దవారిగా కనిపిస్తారు. మితిమీరిన కోపం మంచిది కాదని పెద్దలు అంటుంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. ఈ కోపం మానసిక సమస్యలు, ఒత్తిడి, నిరాశకు కారణమవుతుంది. ఇది అకాలంగా వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలామందికి నీళ్లు సరిగా తాగరు. ఈ అలవాటు అమ్మాయిల్లో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్రకూడా చాలా అవసరం. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ కొంతమంది అమ్మాయిలు ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే త్వరగా మేల్కొంటారు. వీరికి తగినంత నిద్ర ఉండదు. ఈ నిద్ర లేకపోవడం ఒత్తిడికి గురిచేసి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్ వీడియో