Banana: ఈ టైమ్‌లో అరటిపండు అస్సలు తినకండి.! నిపుణుల సలహా ఏంటంటే.?
అరటిపండు చిన్నపిల్లలనుంచి వృద్ధుల వరకూ అందరికీ ఇష్టమే. అరటి పండులో ఎన్నో పోషకాలున్నాయి.. రోజూ ఒక అరటిపండు తీసుకోవడం వల్ల 33 శాతం విటమిన్లను కవర్ చేసుకోవచ్చు. అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, కాల్షియం, ఇతర విటమిన్లు వంటి కీలక పోషకాలున్నాయి. అరటి జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది.. అరటి పండ్లలో ఎక్కువగా ఉండే పెక్టిన్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది.
అరటిపండును మితంగా తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా పాలు – అరటిపండు కలిపి తినడం అల్పాహారంలో ఒక భాగం. ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సహకరిస్తుంది. అయితే.. కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండును తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండు ఆకలిని తీర్చడమే కాకుండా శరీరానికి శక్తిని అందిస్తుంది. బరువు పెరగాలనుకునే వారు ఈ పండును ఎక్కువగా తీసుకుంటారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల ఎసిడిటీ లేదా గ్యాస్ వస్తే, దానికి దూరంగా ఉండటం మంచిది. లేకుంటే కడుపులో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి, ఇది కార్బోహైడ్రేట్లకు గొప్ప మూలం. కాబట్టి కొన్నిసార్లు ఇది జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, వాంతులు, కడుపు నొప్పి, అనేక ఇతర సమస్యలు సంభవించవచ్చు. మీరు దానిని తినవలసి వస్తే, ఇతర ఆహారాలతో కలిపి తినొచ్చు.
స్థూలకాయం ఉన్నవారు అరటిపండు తినడం వల్ల బరువు మరింత పెరుగుతారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తింటే, శరీరానికి అధిక కార్బోహైడ్రేట్లు, కేలరీలు అందుతాయి. ఇది బరువు పెరుగుటకు కారణమవుతుంది. బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడే వారు ఉదయం, రోజంతా ఒకటి కంటే ఎక్కువ అరటిపండు తినకూడదు. రక్తహీనత సమస్యతో బాధపడే వారు కూడా పరగడుపున అరటిపండును తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు కూడా అరటి పండును తినకూడదు.. తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అరటిపండు మధ్యాహ్న సమయంలో తినడం ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో మీకు నీరసంగా అనిపిస్తే, అప్పుడు అరటిపండు తింటే.. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. కడుపు కూడా ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి చాలా ఆలస్యంగా అరటిపండు తినకపోవడమే మంచిది. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.