పదో తరగతి విద్యార్థులకు సూపర్ న్యూస్.. సాయంత్రం రుచికరమైన స్నాక్స్, మెనూ ఇదే
తెలంగాణ ప్రభుత్వం టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలో పదో తరగతి పరీక్షల కోసం అదనపు క్లాసుల నిర్వహణ, పరీక్షల కోసం విద్యార్ధులను సిద్ధం చేస్తున్న తరుణంలో విద్యార్ధులు ఆకలితో ఉండకుండా సాయంత్రం సమయంలో వారికి స్నాక్స్ అందించాలని నిర్ణయించింది.
ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లలోనూ దీన్ని అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం 6 రకాల స్నాక్స్ అందించనున్నారు. వారంలో రోజుకొక రకం అందించనున్నారు. ఉడికించిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడా, ఆనియన్ శనగలు, బాయిల్డ్ పెసర్లు, పల్లి పట్టి, మిల్లెట్ బిస్కెట్లు అందించాలని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఒక్కో స్టూడెంట్ కు రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో వేయనున్నారు. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. సర్కారు బడుల్లో ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ అన్ని బడుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అన్ని బడుల్లో ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా స్పెషల్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడవలేను.. పడుకోలేను ! సునీతా విలియమ్స్ పోరాటం
పెళ్లికి ఊరేగింపుగా వచ్చిన వరుడికి ఊహించని షాక్..ఏం జరిగిందంటే ??
భూమ్మీద నరకం.. ఆ జైలు.. అక్రమ వలసదారులను అక్కడికే

నటితో ప్రేమలో పడ్డ దొంగ.. గిఫ్ట్ కింద రూ.3 కోట్ల ఇల్లు

రైతు పొలం దున్నుతుండగా..నాగలికి ఏదో అడ్డు తగిలింది.. వీడియో

తెల్లవారుజామున ఆ విద్యార్ధి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్..వీడియో

ఓర్నీ.. ఈ ఎలక్ట్రీషియన్ తెలివికి అవార్డ్ ఇవ్వాల్సిందే..!

ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు!వీడియో

వీడికి ఇదేం మాయరోగం? మహిళలు బట్టలు ఆరేస్తే చాలు.. వీడియో!

రైతు వెళ్లే దారిలో పులి.. తర్వాత ఏం జరిగిందంటే...?వీడియో
