సోనూ సూద్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తారా?
మోసం చేశాడని ఓ న్యాయవాది వేసిన కేసులో సోనూ సూద్ వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకి రావడం లేదు. దీంతో పంజాబ్‌లోని లూథియానా కోర్టు సోనూ సూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు ముంబైలోని అందేరీ వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోనూ సూద్‌ను అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టమని ఆర్డర్ ఇచ్చింది. అసలు ఆ కేసు వివరాలేంటో ఓ సారి చూద్దాం.
లూథియానాకు చెందిన లాయర్ రాజేష్ ఖన్నా పది లక్షలు మోసపోయినట్టుగా కేసు వేశారు. మోహిత్ శుక్లా మోసం చేశాడని, రిజికా కాయిన్ అంటూ చెప్పి పది లక్షలు కాజేశారని కేసు వేశాడు. ఈ కేసులో సోనూ సూద్ సాక్షిగా ఉన్నారు. కానీ వాదనలకు సోనూ సూద్ రాలేదు. దీంతో లూథియానా కోర్టు సోనూ సూద్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన సోనూ సూద్‌ను తమ ముందు హాజరు పర్చాలని పోలీస్ డిపార్టెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. సోనూ సూద్ రీసెంట్‌గానే ఫతే అంటూ బాలీవుడ్ ఆడియెన్స్‌ను పలకరించాడు. ఈ మూవీకి ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. విలన్ టు హీరోగా మారిన తరువాత సోనూ సూద్ హవా తగ్గినట్టు అనిపిస్తోంది. కరోనా టైంలో ఇండియన్ సూపర్ హీరో అనే రేంజులో క్రేజ్ దక్కించుకున్నాడు. సోనూ సూద్ అదంతా ఒక్కడే చేశాడా? అనే అనుమానాలు కూడా చాలా మందిలో మెదిలాయి. ఇంత డబ్బు సోనూ సూద్‌కి ఎక్కడిది? అంటూ అంతా ఆరాలు తీశారు. అలాంటి సోనూ సూద్‌కు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరి సోనూ సూద్ ఏం చేస్తాడో చూడాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
69 ఏళ్ల వయసులో ఈ పనేంటి స్టార్ సింగర్ ?? నెట్టింట హాట్ టాపిక్
చిన్న మామ ఇలాకాలో.. ఉపాసన గొప్ప కార్యక్రమం
Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ మాటను పవన్ వింటారా ??
టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
రూ.100 కోట్లు నష్టం.. పైగా జైలు శిక్ష !! ఇదీ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దీన గాథ

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
