Khushi Kapoor – Baby: హిందీ బేబీలో హీరోయిన్‌గా.. శ్రీదేవీ చిన్న కూతురు.! వీడియో.
కంటెంట్ బాగుంటే చాలు సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సినిమాల్లో బేబి సినిమా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవర కొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యవతను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు సాయి రాజేష్.
కంటెంట్ బాగుంటే చాలు సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సినిమాల్లో బేబి సినిమా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవర కొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యవతను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు సాయి రాజేష్. ఇక సోషల్ మీడియాతో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది వైష్ణవి చైతన్య. తన నటనతో ఈ సినిమాలో మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమా థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ సూపర్ హిట్ గా నిలిచింది బేబీ సినిమా ఇక ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. అయితే బాలీవుడ్ లోనూ సాయి రాజేశే దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అదే కథను హిందీలోనూ తెరకెక్కించనున్నారు సాయి రాజేష్.
అంతే కాదు ఈ సినిమాకు ‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారట. బేబీ మూవీ నిర్మాత ఎస్‌కేఎన్ ఈ సినిమాను హిందీలోనూ నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఇప్పుడు బేబీ రీమేక్ కూడా అంతే రేంజ్ లో హిట్ అవుతుందని తెలిపారు ఎస్‌కేఎన్. ఇక బేబీ మూవీ రీమేక్ లో హీరోయిన్ గా స్టార్ కిడ్ నటిస్తుందని తెలుస్తోంది. వైష్ణవి చైతన్య పాత్రలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ నటిస్తుందని లీక్. బోనీ కపూర్ కానీ, కరణ్ జోహార్ కానీ ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

