Vishal: దివాళా తీసాశా ?? విశాల్‌ పై కోర్టు ఆగ్రహం

Updated on: Nov 27, 2025 | 1:34 PM

ప్రముఖ నటుడు విశాల్‌కు లైకా ప్రొడక్షన్స్‌తో ఉన్న రూ.21.29 కోట్ల రుణ వివాదంలో మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాల్ ఆర్థిక సమస్యలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'దివాళా తీశారా?' అని సూటిగా ప్రశ్నించింది. ఈ వ్యవహారం టాలీవుడ్‌, కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ప్రశ్నలు విశాల్‌ను ఇరుకున పెట్టాయి.

ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్‌కు మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం విశాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాల్ తన సొంత నిర్మాణంలో వచ్చిన ‘వాగై సూడుం’ చిత్రాన్ని స్వయంగా విడుదల చేయడంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో, లైకా సంస్థకు విశాల్ చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ విశాల్ దాఖలు చేసిన అప్పీల్‌పై తాజాగా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈక్రమంలో విశాల్ తరపు న్యాయవాదులు, తమ క్లయింట్ ధనవంతుడు కాదని కోర్టుకు తెలిపారు. దీనిపైనే ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. “అయితే, విశాల్ దివాళా తీశారు అని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా?” అంటూ సూటిగా ప్రశ్నించింది. అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్థిక సమస్యలపై విశాల్‌ను హైకోర్టు నిలదీయడం ఇప్పుడు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన అనంతపురం అమ్మాయి అదుర్స్‌.. తొలి టీ 20 వరల్డ్‌ కప్‌ను అందుకున్న దీపిక

Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

బాలయ్య క్రేజ్‌ ముందు మోకరిల్లిన అవెంజర్స్‌

సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్‌ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్‌

పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి