Vijay Thalapathy: సరదా కోసం ఏకంగా 2 కోట్ల 50 లక్షలు ఖర్చు.! విజయ్ దళపతి లగ్జరీ ఐటమ్.

|

Jan 25, 2024 | 8:02 AM

స్టార్ హీరోలకు.. ఫిల్మ్ సెలబ్రిటీలకు ఎన్నో సరదాలుంటాయి. అందుకోసం లెక్కకు మించిన డబ్బులు పక్కకే ఉంటాయి. అందుకే సరదా తీర్చుకోడానికి డబ్బులను లెక్క చేయరు. తమ సరదాలను తీర్చేసుకుంటారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ఇలయదళపతి కూడా ఇదే చేశారు. తన సరదా కోసం.. ఏకంగా 2 కోట్ల 50 లక్షలను ఖర్చు చేశారు. ఇంతకీ ఏం చేశారంటారా? బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ కొనేశారు.

స్టార్ హీరోలకు.. ఫిల్మ్ సెలబ్రిటీలకు ఎన్నో సరదాలుంటాయి. అందుకోసం లెక్కకు మించిన డబ్బులు పక్కకే ఉంటాయి. అందుకే సరదా తీర్చుకోడానికి డబ్బులను లెక్క చేయరు. తమ సరదాలను తీర్చేసుకుంటారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ఇలయదళపతి కూడా ఇదే చేశారు. తన సరదా కోసం.. ఏకంగా 2 కోట్ల 50 లక్షలను ఖర్చు చేశారు. ఇంతకీ ఏం చేశారంటారా? బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ కొనేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవలే లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇటు తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఇటు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ప్రస్తుతం విజయ్ తన కెరీర్‏లో రాబోతున్న 69వ చిత్రంలో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దళపతికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తమిళ్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. దళపతి ఓ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడట. అది కూడా కొత్తగా ఎలక్ట్రిక్ కారును కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. BMW i7 x Drive 60 లగ్జరీ కారును తీసుకున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక దీని ధర దాదాపు 2.50 కోట్లు అట. తనకు నచ్చిన విధంగా… ఈ కారులో ఇంటీరియర్ కూడా చేయించుకున్నారట దలపతి. అంతేకాదు ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే..ఈ కారు దాదాదాపు 625 కిలోమీటర్ల రేంజ్‌ వస్తుందట. ఎంతో ఇష్టపడి మరీ.. విజయ్ ఈ కార్‌ను తీసుకున్నారట. ఇక ఈ కారుకు సంబంధించిన డీటెల్స్ అండ్ ప్రైస్‌ తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. సరదా విలువ 2.50 కోట్లా అని కొంత మంది నెటిజన్లను నోరెళ్ల బెట్టేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos