Vijay Devarakonda: పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా.!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు సక్సెస్ అయినా, ప్లాఫ్ అయినా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ఇక విజయ్ కూడా తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకు ఎంతో గౌరవం, మర్యాద ఇస్తాడు. వారు ఏ సాయమైనా అడిగితే కాదనకుండా హెల్ప్ చేస్తాడు. అలాగే తన సిబ్బంది పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తుంటాడు.
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు సక్సెస్ అయినా, ప్లాఫ్ అయినా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ఇక విజయ్ కూడా తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకు ఎంతో గౌరవం, మర్యాద ఇస్తాడు. వారు ఏ సాయమైనా అడిగితే కాదనకుండా హెల్ప్ చేస్తాడు. అలాగే తన సిబ్బంది పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తుంటాడు. వారి కష్ట, సుఖాల్లోనూ పాలు పంచుకుంటుంటాడు. అలా తాజాగా తన పర్సనల్ గార్డ్ పెళ్లికి హాజరై సందడి చేశాడు విజయ్ దేవరకొండ. తన పర్సనల్ గార్డ్ పెళ్లికి హాజరవడమే కాదు కొత్త దంపతులను ఆశీర్వదించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన విజయ్‌ను అక్కడి పెద్దలు ఘనంగా సన్మనించారు. కత్తిని బహూకరించారు.
అలాగే రౌడీ హీరో కలిసి ఫొటోలు దిగారు. ఇక దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే. .ఖుషి తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవర కొండ. పరశు రామ్ పెట్ల దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైన ఫ్యామిలీ స్టార్ యావరేజ్ గా నిలిచింది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుందీ మూవీ. త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయనున్నాడు ఫ్యామిలీ స్టార్. దీని తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!