Venkatesh – Saindhav: OTTలో సైంధవ్.! అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్.!
విక్టరీ వెంకటేశ్ హీరోగా యాక్ట్ చేసిన లేటేస్ట్ మూవీ 'సైంధవ్'. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. జనవరి 13న విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అప్పటికే గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు విడుదలై హిట్ టాక్ అందుకున్నా.. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం కాస్త వెనకబడింది. అయితే ఈ సినిమాలో వింటేజ్ వెంకటేష్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేసిన ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్ హీరోగా యాక్ట్ చేసిన లేటేస్ట్ మూవీ ‘సైంధవ్’. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. జనవరి 13న విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అప్పటికే గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు విడుదలై హిట్ టాక్ అందుకున్నా.. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం కాస్త వెనకబడింది. అయితే ఈ సినిమాలో వింటేజ్ వెంకటేష్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేసిన ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు. అఫీషిలయ్ డేట్ కోసం ఆరా తీస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అవడంతో.. మంచి ఫ్యాన్సీ రేట్‌కు ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్. ఇక సినిమా రిలీజ్ అయి దాదాపు 20 రోజులు అయిందో లేదో.. అప్పుడే ఓటీటీ స్ట్రిమింగ్ కి రెడీ అయిపోయింది. వెంకటేష్ సైంధవ్ మూవీని ఫిబ్రవరి 3 నుంచి తమ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రైమ్ తాజాగా అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేయడమే కాదు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos