సల్మాన్ సినిమాలో వెంకటేష్..  షూటింగ్‌లో జాయిన్ అవుతున్న వెంకీమామ

సల్మాన్ సినిమాలో వెంకటేష్.. షూటింగ్‌లో జాయిన్ అవుతున్న వెంకీమామ

Phani CH

|

Updated on: Jun 01, 2022 | 9:24 PM

ఎఫ్‌3 సినిమా సాలిడ్‌ హిట్‌తో జోష్‌ మీదున్న వెంకీమామ, అదే జోష్‌ను కొనసాగిస్తూ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోడానికి రెడీ అయిపోయారు.

ఎఫ్‌3 సినిమా సాలిడ్‌ హిట్‌తో జోష్‌ మీదున్న వెంకీమామ, అదే జోష్‌ను కొనసాగిస్తూ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోడానికి రెడీ అయిపోయారు. సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తున్నారు. పూజ అన్న పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో జరగనుంది. జూన్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో వెంకటేష్‌ పాల్గొంటారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోని ధర్మస్థలి సెట్ లోనే ఈ షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. వెంకటేష్‌కు సల్మాన్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే సల్మాన్ అడగ్గానే ఈ సినిమాలో నటించేందుకు వెంకీ ఓకే చెప్పారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Akkineni Nagarjuna: మరో యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నాగ్‌ గ్రీన్ సిగ్నల్ !!

80 ఏళ్ల బామ్మ ఊర మాస్ డాన్స్‌.. దద్దరిల్లిన కళ్యాణ మండపం

Mahesh Babu: ఐ లవ్‌ యూ నాన్న !! ఎమోషనల్ అయిన మహేష్ బాబు

 

Published on: Jun 01, 2022 09:24 PM