80 ఏళ్ల బామ్మ ఊర మాస్ డాన్స్.. దద్దరిల్లిన కళ్యాణ మండపం
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎటు చూసినా డీజే సౌండ్స్, పెళ్లి బరాత్‌లు, బంధువుల డాన్స్‌లతో కోలాహలం కనిపిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో దాదాపు మూడేళ్ల తర్వాత ప్రజలంతా సామాన్య జీవనశైలికి అలవాటు పడుతున్నారు.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎటు చూసినా డీజే సౌండ్స్, పెళ్లి బరాత్‌లు, బంధువుల డాన్స్‌లతో కోలాహలం కనిపిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో దాదాపు మూడేళ్ల తర్వాత ప్రజలంతా సామాన్య జీవనశైలికి అలవాటు పడుతున్నారు. పైగా ఈ ఏడాది ముహూర్తాలు కూడా తక్కువ ఉండటంతో పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ఇక పెళ్లంటే సందడే సందడి.. బంధుమిత్రులు, చిన్న పెద్దల కోలాహలంతో ఎంతో సందడిగా ఉంటుంది. ఇక పెళ్లి బరాత్‌లో బంధువులు, స్నేహితులు చేసే డాన్స్‌లు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ క్రమంలో ఓ పెళ్లి వేదికపై 80 ఏళ్ల బామ్మ అద్భుతంగా డాన్స్‌చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుడి పక్కన ఉన్న వధువును పక్కకు నెట్టి వరుడితో కలిసి హుషారుగా స్టెప్పులు వేసింది..బామ్మ స్టెప్పులకు అక్కడున్నవారిలో జోష్ పెరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబాసిడర్ కార్ .. మళ్లీ సందడి చేయనుంది.. మోడ్రన్ లుక్‌లో వీధుల్లోకి
పెళ్లిచూపుల ట్వీట్..! అబ్బాయి ప్రశ్నలకు నెటిజన్ల ఆన్సర్ హైలైట్..!