భారతీయుడు చేయడానికి ఆ స్టార్ హీరోనే కారణం.. కమల్ ఎమోషనల్

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

భారతీయుడు చేయడానికి ఆ స్టార్ హీరోనే కారణం.. కమల్ ఎమోషనల్

|

Updated on: Jun 04, 2024 | 10:19 PM

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇక ఈ వేడుకలోనే కమల్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దాంతో పాటే ఇండియన్ 1 సినిమా చేయడానికి కారణం ఓ లెజండరీ హీరోనే అంటూ చెప్పి… తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. “28 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా టైంలో నేను శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాలి. ఆ టైంలోనే శంకర్ ఇండియన్ కథతో వచ్చారు. రెండు కథలు కొంచెం దగ్గరదగ్గరగా ఉన్నాయి. అదే విషయాన్ని శివాజీ గణేశన్ గారితో చెప్పాను. ‘శంకర్ గారితోనే సినిమా చేయండి.. ఆయన ఆల్రెడీ ఓ సినిమాను తీశారు. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. ఆయన అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతోనే శంకర్ గారితో ఇండియన్ సినిమా చేశాను అన్నారు” కమల్. అంతేకాదు ఆ టైంలో తాను గానీ, శంకర్ గానీ రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుకోలేదన్నారు. కానీ ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం భారతీయుడు సినిమాను అద్భుతంగా నిర్మించారని కొనియాడారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kalki 2898 AD: గెట్ రెడీ.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది !!

Follow us