డిసెంబర్‌లో సినిమా జాతర.. తెలుగు సినిమాలు Vs డబ్బింగ్ సినిమాలు వీడియో

Edited By:

Updated on: Nov 23, 2025 | 5:57 PM

డిసెంబర్‌లో బాక్సాఫీస్ వద్ద తెలుగు, డబ్బింగ్ సినిమాల మధ్య పెద్ద పోటీ నెలకొననుంది. బాలయ్య అఖండ 2, శర్వానంద్ బైకర్, రోషన్ కనకాల మోగ్లీతో పాటు పలు చిత్రాలు విడుదల కానున్నాయి. అవతార్ 3, కార్తీ, సూర్య డబ్బింగ్ చిత్రాలు కూడా రేసులో నిలిచి, సినీ ప్రేక్షకులకు వినోదాల విందును అందించనున్నాయి.

డిసెంబర్‌లో సినీ ప్రేక్షకుల కోసం ఓ పెద్ద పండుగ సిద్ధమవుతోంది. ఈ నెలలో తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాల మధ్య బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొననుంది. కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగు చిత్రాలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 5న బాలకృష్ణ నటించిన అఖండ 2 విడుదల కానుంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీని ప్రీ-రిలీజ్ బిజినెస్‌తోనే రూ. 150 కోట్ల మార్కును తాకినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో

Published on: Nov 23, 2025 11:58 AM