TOP9 ET: ఏంటి తారక్ 140 కోట్లా..? | ఐబొమ్మ గురించి బయటపడ్డ షాకింగ్ నిజం.!

TOP9 ET: ఏంటి తారక్ 140 కోట్లా..? | ఐబొమ్మ గురించి బయటపడ్డ షాకింగ్ నిజం.!

Anil kumar poka

|

Updated on: Aug 29, 2023 | 8:41 AM

ఐబొమ్మ సేఫా..కాదా.. ?అంటే సేఫ్ కాదనే అంటున్నారు టెకీస్ అండ్ సైబర్ ఎక్స్‌పర్ట్స్‌. ఐబొమ్మ కూడా.. మూవీ రూల్స్, తమిళ్ టోరెంట్స్ మాదిరిగానే అన్ అఫీషియల్ సైట్స్‌ అని.. వాటి వల్ల.. ఎప్పటికీ ప్రమాదమే అని వారంటున్నారు. ఈ సైట్‌తో కూడా.. అందరికి సైబర్ ముప్పు తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని తమ ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్‌లలో కోట్ చేస్తున్నారు. సో ఒక వేళ మీరు కూడా ఐబొమ్మ వాడుతుంటే బీ కేర్ ఫుల్.

01.IBOMMA
ఐబొమ్మ సేఫా..కాదా.. ?అంటే సేఫ్ కాదనే అంటున్నారు టెకీస్ అండ్ సైబర్ ఎక్స్‌పర్ట్స్‌. ఐబొమ్మ కూడా.. మూవీ రూల్స్, తమిళ్ టోరెంట్స్ మాదిరిగానే అన్ అఫీషియల్ సైట్స్‌ అని.. వాటి వల్ల.. ఎప్పటికీ ప్రమాదమే అని వారంటున్నారు. ఈ సైట్‌తో కూడా.. అందరికి సైబర్ ముప్పు తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని తమ ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్‌లలో కోట్ చేస్తున్నారు. సో ఒక వేళ మీరు కూడా ఐబొమ్మ వాడుతుంటే బీ కేర్ ఫుల్.

02.Devara
ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే 140 కోట్లు ఖర్చు చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ సౌత్‌కు పరిచయం అవుతున్నారు.

03.RC 16
గేమ్ చేంజర్‌ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేయటంతో నెక్ట్స్ మూవీ మీద ఫోకస్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌. ఇప్పటికే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేసిన చెర్రీ, త్వరలో ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా కోసం కొత్త ఆఫీస్‌ను ప్రారంభించారు మేకర్స్‌.

04.OG
పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ స్టార్ట్ అయిన విషయాన్ని పిక్‌తో షేర్‌ చేసి చెప్పారు మేకర్స్. దీంతో మేజర్‌ పార్ట్ షూటింగ్‌ పూర్తవుతుంది. నెక్స్ట్ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సెట్‌కి వెళ్తారు పవన్‌కల్యాణ్‌.

05.Bhairavadhweepam
బాలకృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది భైరవద్వీపం. నటుడిగా బాలయ్య 49 ఏళ్లు పూర్తి చేసుకొని 50వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 30న రీరిలీజ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించి 4కె ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలకృష్ణకు జోడీగా రోజా నటించారు.

06.Nuvve Kavali
తరుణ్ హీరోగా విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ హిట్ నువ్వే కావాలి. రామోజీ రావు, స్రవంతి రవికిశోర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించారు. అప్పట్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాను రీ మాస్టర్ చేసి 4కేలో రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్‌.

07.Nani
నేచురల్‌ స్టార్ నాని మరో ఇంట్రస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ మూవీ డాన్ ఫేం సిబి చక్రవర్తి దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. డిస్కషన్‌ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రానుంది. ప్రజెంట్‌ ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న హాయ్‌ నాన్న వర్క్‌లో బిజీగా ఉన్నారు నాని.

08. Samantha
సమంత రూత్‌ ప్రభు ఇప్పుడు మయోసైటిస్‌ ఇండియాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఆమెకు మయోసైటిస్‌ ఉన్న విషయం తెలిసింది. ఆటో ఇమ్యూన్‌ కండిషన్‌ గురించి జనాలకు అవగాహన కలిగించనున్నారు సమంత.

09.Gadar
గదర్‌ సీక్వెల్‌ గురించి గుడ్‌న్యూస్‌ చెప్పేశారు నార్త్ ట్రేడ్‌ పండిట్స్. ఈ సినిమా కలెక్షన్లు ఇండియాలో కేజీయఫ్‌2ని దాటేశాయని టాక్‌. ఇండియాలో 440 కోట్ల దాకా కలెక్ట్ చేసింది గదర్‌ సీక్వెల్‌. దీంతో ఇండియాలో థర్డ్ హయ్యస్ట్ గ్రాసర్‌ హిందీ సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..