TOP 9 ET: మైండ్ బ్లాక్ అయ్యేలా భోళా శంకర్.. | బ్రో అవతార్ లోడింగ్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు హరీష్‌తో కలిసి వర్క్ చేస్తున్న దశరద్ కథ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ సూపర్ హిట్ తెరి సినిమాకు రీమేక్ అన్నారు.
01.Chiranjeevi
రీసెంట్‌గా తాతగా ప్రమోషన్ తీసుకుని.. తన మనవరాలిని చూస్తూ.. మురిపోతున్న మెగా స్టార్ చిరు.. తాజాగా తన ఫ్యాన్స్‌కు … దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చారు. ఆఫర్ట్ వాల్తేరు వీరయ్య … భోళా శకంర్‌లో తన స్వాగ్ ఏంటో.. యాటిట్యూడ్ ఎంటో.. చిన్న టీజర్‌తో చూపించారు. మరో సారి వింటేజ్ చిరును గుర్తుకు తెస్తూ… తన లుక్‌తో.. యాక్షన్తో అందరికీ గూస్ బంప్స్ తెప్పించారు. దాంతో పాటే దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటూ.. యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అయిపోతున్నారు చిరు.
02.Pawan Kalyan
ఎట్ ప్రజెంట్ రాజకీయ క్షేత్రంలో… వారాహి మీద ఠీవిగా తిరుగూ.. తన అపోనెంట్స్ మీద నిప్పులు చెరుగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… మరో సారి తన బ్రో అవతార్‌లో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు పొలికల్ మాటలతో.. తన ప్రసంగాలతో … నెట్టింట ట్రెండ్ అయిన.. ఈ జనసేనాని.. త్వరలో దేవుడిగా.. బ్రో నామధేయుడిగా… సోషల్ మీడియాను షేక్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన తన ఫస్ట్ లుక్‌కు అడీషనల్‌గా.. బ్రో టీజర్‌తో రెండు మూడు రెజుల్లోనే మన ముందుకు రాబోతున్నారు. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. అంతేకాదు బ్రో అవతార్ లోడింగ్ అంటూ ఓ నయా పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
03.Ustaad
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు హరీష్‌తో కలిసి వర్క్ చేస్తున్న దశరద్ కథ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ సూపర్ హిట్ తెరి సినిమాకు రీమేక్ అన్నారు. అయితే కేవలం మెయిన్ ఫ్లాట్ మాత్రమే తీసుకొని పూర్తిగా కొత్త ట్రీట్మెంట్‌తో సినిమాను సిద్దం చేస్తున్నామన్నారు.
04.Gunturkaram
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి రీస్టార్ట్ కానుంది. సమ్మర్ వెకేషన్ కోసం ఫారిన్ వెళ్లిన మహేష్, ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. గతంలో త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మహేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టడంతో గుంటూరు కారం మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
05.kantara
కాంతార చిత్రం ప్రీక్వెల్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు హీరో రిషబ్ వెట్టి. డివైన్ బ్లాక్‌బస్టర్‌గా పేరు తెచ్చుకుంది కాంతార సినిమా. ఇప్పుడు తెరకెక్కిస్తున్న సినిమా క్లైమాక్స్….. ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌తో లింక్ అయి ఉంటుందని ఆల్రెడీ చెప్పారు రిషబ్. ఇక ఆస్కార్ బరిలో అవార్డులు కొల్లగొట్టడమే లక్ష్యంగా తెరకెక్కుతోంది కాంతార ప్రీక్వెల్.
06.shobita
కెరీర్ ప్రారంభంలో ప్రతిదానికీ పోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు నటి శోభిత ధూళిపాళ. ఇటీవల విడుదలైన పొన్నియిన్ సెల్వన్‌లోనూ మెరిశారు శోభిత. ప్రస్తుతం ది నైట్ మేనేజర్ పార్ట్ 2 లో నటిస్తున్నారు. కెమెరా ముందు అందంగా లేవంటూ, తన కెరీర్ స్టార్టింగ్‌లో కొందరు చేసిన విమర్శల గురించి మాట్లాడారు. అలాంటి మాటలు పట్టించుకుంటే ఎదగలేమని అన్నారు.
07.fahad fazil
ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన సినిమా ధూమమ్. ఈ సినిమా స్టోరీని కోవిడ్‌కి ముందే విన్నానని అన్నారు ఫాహద్. ముందు కన్నడలో చేద్దామని మేకర్స్ చెప్పారని, మలయాళంలో చేయమని తానే చెప్పానని తెలిపారు. ఒకప్పుడు మలయాళ సినిమాల్లో నటిస్తే చాలనుకున్నానని, ఇప్పుడు మంచి స్క్రిప్ట్ ఎక్కడున్నా చేయాలనుకుంటున్నానని చెప్పారు.
08.king of kotha
మీట్ ద కాస్ట్ అంటూ కింగ్ ఆఫ్ కోత మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ నెల 28న టీజర్ విడుదల కానుంది. మూవీని ఓనమ్‌కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కింగ్ ఆఫ్ కోతను ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు.
09.Japan
కార్తి హీరోగా తెరకెక్కుతున్న జపాన్ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. టాకీతో పాటు సాంగ్స్ షూట్ కూడా పూర్తయినట్టుగా వెల్లడించారు మేకర్స్. కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని… అది కూడా మరో పది రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దీవాళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతమందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!