AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET: మెగా ప్రిన్స్‌ ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ | వాళ్లకు ఆదిపురుష్‌ టికెట్‌ ఫ్రీ..

TOP 9 ET: మెగా ప్రిన్స్‌ ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ | వాళ్లకు ఆదిపురుష్‌ టికెట్‌ ఫ్రీ..

Anil kumar poka
|

Updated on: Jun 08, 2023 | 9:16 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సమ్మర్ వెకేషన్‌ పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. త్వరలో పుష్ప 2 షూటింగ్‌ను రీ స్టార్ట్ చేయబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నారు.

01.Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సమ్మర్ వెకేషన్‌ పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. త్వరలో పుష్ప 2 షూటింగ్‌ను రీ స్టార్ట్ చేయబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్‌ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

02.Balayya
గిప్పడి సంది ఖేల్ అలగ్ అని అంటున్నారు నందమూరి బాలకృష్ణ. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాకు భగవంత్‌ కేసరి అనే టైటిల్‌ని అనౌన్స్ చేశారు.
ఐ డోంట్‌ కేర్‌ అనేది ట్యాగ్‌లైన్‌. షైన్‌ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

03.Gandivadhari
యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా గాంఢీవదారి అర్జున్‌. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్‌. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు.

04.Dhruva natchathiram
చియాన్‌ విక్రమ్‌ హీరోగా నటించిన సినిమా ధ్రువ నక్షత్రం. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వం వహించారు. ఎన్నాళ్లుగానో రిలీజ్‌ పెండింగ్‌ పడ్డ ప్రాజెక్ట్ ఇది. ఈ నెల 17న ధ్రువనక్షత్రం ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. జులై ఎండింగ్‌లోగానీ, ఆగస్టులోగానీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

05.Priya Prakash
వింక్‌ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ పై ఆమె తొలి చిత్ర దర్శకుడు ఒమర్ లులు ఫైర్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓరు అదార్ లవ్ సినిమాలో కన్నుగీటే ఐడియా తనదే అంటూ కామెంట్ చేశారు ప్రియా ప్రకాష్. ఈ కామెంట్స్ మీద స్పందించిన దర్శకుడు ‘పాపం పిచ్చి పిల్ల, ఐదేళ్ల క్రితం జరిగిన విషయాలు అన్ని మర్చిపోయినట్టుంది. జ్ఞాపక శక్తికి వలియ చందనాది తైలం బాగా ఉపయోగపడుతుంది’ అంటూ సెటైర్ వేశారు.

06.Sara Ali Khan
బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్ డేటింగ్ వార్తలపై స్పందించారు. ప్రస్తుతం జర హట్కే జర బచ్కే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఓ క్రికెటర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఇప్పటిదాకా తన జీవిత భాగస్వామిని కలవలేదన్న సారా, తన మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా అతడితో కొత్త జీవితాన్ని మొదలు పెడతానని చెప్పారు.

07.Sarwanand
నటుడు శర్వానంద్‌ వివాహ రిసెప్షన్‌ జూన్ 9న హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో జరగనుంది. ఇటీవల రాజస్థాన్‌ జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో రక్షిత మెడలో మూడుముళ్లు వేశారు శర్వానంద్‌. వివాహానికి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. రిసెప్షన్‌కి ఇండస్ట్రీ ప్రముఖులు హాజరుకానున్నారు.

08. varun engagement
వరుణ్‌తేజ్‌, లావణ్యత్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ వార్త అఫిషియల్‌గా వచ్చేసింది. జూన్ 9 సాయంత్రం వరుణ్‌తేజ్‌ స్వగృహంలో వీరి నిశ్చితార్థం జరగనుంది. త్వరలోనే పెళ్లి కూడా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్‌తేజ్‌, లావణ్య గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. అంతరిక్షం, మిస్టరీ సినిమాల్లో కలసి నటించారు వరుణ్‌, లావణ్య.

09.Adipurush
ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 16న రిలీజ్ అవుతున్న ఆదిపురుష్‌ సినిమాను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉండేవారి కోసం ఉచితంగా ప్రదర్శించబోతున్నారు. వారి కోసం 10 వేల టికెట్లు కేటాయిస్తున్నట్టుగా వెల్లడించారు. ప్రభాస్‌ రాఘవుడిగా నటించిన ఈ సినిమాకు ఓం రవుత్ దర్శకుడు. కృతి సనన్‌ సీత పాత్రలో నటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.