TOP 9 ET: గేమ్‌ ఛేంజర్ ఇప్పుడప్పుడే లేనట్టే.| మంగవాళవారం సినిమాకు దిమ్మతిరిగే రెస్పాన్స్‌.

TOP 9 ET: గేమ్‌ ఛేంజర్ ఇప్పుడప్పుడే లేనట్టే.| మంగవాళవారం సినిమాకు దిమ్మతిరిగే రెస్పాన్స్‌.

Anil kumar poka

|

Updated on: Nov 19, 2023 | 9:41 AM

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం పవన్ కళ్యణ్ వాయిస్ ఓవర్ అందించనున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. గతంలో పవన్ నటించిన జల్సాకు మహేష్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే రీతిలో త్రివిక్రమ్ కోసం పవన్ తన వాయిస్ గుంటూరు కారం కోసం ఇస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి 12న విడుదల కానుంది గుంటూరు కారం. | అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్బీకే స్పెషల్ ఎడిషన్‌లో భాగంగా మరో మెగా ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

01. Game Changer
రామ్ చరణ్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఈ సినిమా ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. అకార్డింగ్ టూ ఫిల్మ్ రిపోర్ట్.. చెర్రీ హీరోగా.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ దానికంటే ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. భారతీయుడు 2 సినిమాను 2024 సమ్మర్‌కు విడుదల చేసి.. ఆ తర్వాత మూడు నాలుగు నెలల గ్యాప్‌లోనే భారతీయుడు 3 కూడా విడుదల చేయాలని చూస్తున్నారు శంకర్. ఈ లెక్కన 2024 డిసెంబర్‌కు కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చేలా కనిపించడం లేదు మరి

02.Mangalavaram
ఆఫ్టర్ ఆర్‌ఎక్స్‌ 100 అజయ్‌ భూపతి డైరెక్షన్లో.. పాయల్ రాజ్‌ పుల్ లీడ్‌లో వచ్చిన ఫిల్మ్ మంగళవారం. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈసినిమా అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులోనూ.. సినిమాలో వచ్చే ట్విస్టులకు ఆడియెన్స్‌ థ్రిల్‌గా ఫీలవుతున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నారు.

03.Gunturu Karam
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం పవన్ కళ్యణ్ వాయిస్ ఓవర్ అందించనున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. గతంలో పవన్ నటించిన జల్సాకు మహేష్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే రీతిలో త్రివిక్రమ్ కోసం పవన్ తన వాయిస్ గుంటూరు కారం కోసం ఇస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి 12న విడుదల కానుంది గుంటూరు కారం.

04.Aha
అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్బీకే స్పెషల్ ఎడిషన్‌లో భాగంగా మరో మెగా ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఫస్ట్ టైమ్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొంటున్నారు బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌ రణబీర్ కపూర్‌. నవంబర్ 24న ఆహాలో స్ట్రీమ్ కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్‌.

05.Leo
లియో సినిమాను మరోసారి గ్రాండ్‌గా థియేటర్స్ పెంచి విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. దసరాకు విడుదలైన ఈ చిత్రానికి 600 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. అయితే తమిళనాడులో కొత్త సినిమాలేవీ లేకపోవడంతో.. లియోనే మరో 100 థియేటర్స్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. 5వ వారంలోనూ లియో బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ కొనసాగిస్తోంది.

06.Animal
రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడు పెంచింది యానిమల్ మూవీ టీమ్. అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వీడియో గ్లింప్స్‌ను దుబాయ్‌లో బూర్జ్‌ ఖలీఫా మీద ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హీరో రణబీర్‌, విలన్ బాబీ డియోల్‌తో పాటు నిర్మాత భూషణ్ కుమార్‌ పాల్గొన్నారు.

07.Sumanth
సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీకి మహేంద్రగిరి వారాహి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్‌. గతంలో డివోషనల్ థీమ్‌తో తెరకెక్కిన సుబ్రమణ్యంపురం సినిమాతో మంచి విజయం సాధించిన సుమంత్, ఇప్పుడు మరోసారి అదే ఫార్ములాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు.

08.Tiger 3
టైగర్ 3 ప్రమోషన్‌లో భాగంగా ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు హీరో హీరోయిన్లు. ముంబైలోని ఓ థియేటర్‌కు వెళ్లిన సల్మాన్‌, కత్రినా అభిమానుల సమక్షంలో స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు. టైగర్‌ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఐదు రోజుల్లో 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

09.Sunny leone
తాను యాక్ట్ చేస్తున్న విషయాన్ని పిల్లలతో పంచుకోవడానికి ఇష్టపడనని అంటున్నారు సన్నీలియోన్‌. అభిమానులు తనతో సెల్ఫీ తీసుకోవడానికి ఎందుకు పోటీపడతారనే విషయాన్ని పిల్లలు చాలా సార్లు అడుగుతుంటారని అన్నారు. స్పైడర్‌మేన్‌ని, హల్క్ ని ఇష్టపడేవారందరూ తనను కూడా ఇష్టపడతారని సర్ది చెబుతుంటానని అన్నారు సన్నీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.