TOP9 ET: రూ.172 కోట్ల దేవర రికార్డ్ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!
డే వన్.. రికార్డ్ వసూళ్లు సాధించింది ఎన్టీఆర్ దేవర. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. డే వన్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది దేవర. | కల్కి 2898 ఏడీ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ 2 నుంచి 11 వరకు దక్షిణ కొరియాలో జరిగే బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.
01.Devara: రూ.172 కోట్ల దేవర రికార్డ్.
డే వన్.. రికార్డ్ వసూళ్లు సాధించింది ఎన్టీఆర్ దేవర. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. డే వన్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది దేవర.
02.Kalki: హ్యాట్సాఫ్.! కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం
కల్కి 2898 ఏడీ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ 2 నుంచి 11 వరకు దక్షిణ కొరియాలో జరిగే బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు.
03.Rishab: త్వరలో క్లారిటీ ఇస్తా!
బాలీవుడ్ మీద తన వ్యాఖ్యల విషయంలో జరుగుతున్న వివాదంపై కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్పందించారు. తన కామెంట్స్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారన్న రిషబ్ ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నారు. ఐఫా ఉత్సవ్ 2024లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
04.IIfa: మెగా స్టార్‌కు అరుదైన మెగా పురస్కారం.
ఐఫా అవార్డుల వేడుకలో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో బాలకృష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు. ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సమంత సొంతం చేసుకున్నారు.
05.Mohan Babu: లేట్‌గా కాదు.. లేటెస్ట్‌గా.!
ఏపీలో వరద బాధితుల సహాయార్థం ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షల విరాళం అందించారు. ఈ నేపథ్యంలో తనయుడు మంచు విష్ణుతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరద బాధితుల కోసం రూ.25 లక్షల చెక్కును అందించారు.
06.Game Changer: రాసిపెట్టుకోండి పాట అదిరిపోతుంది.
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా అప్‌డేట్స్ మెల్లగా జోరందుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్ర మొదటి పాట గురించి శంకర్, థమన్ ప్రత్యేకంగా ఓ వీడియో చేసారు. అందులో పాట ఎలా ఉండబోతుందో వివరించారు. సెప్టెంబర్ 28న రా మచ్చ మచ్చ అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్.
07.surya: ముహూర్తం ఎప్పుడు?
డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఆర్.బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. వెట్రిమారన్‌తో వాడివాసల్‌లో నటించడానికన్నా ముందే సూర్య ఈ సినిమాలో నటిస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన నటించిన కంగువ నవంబర్‌లో విడుదల కానుంది.
08.Kangana: మాట మార్చిన కంగన.
ఎమర్జెన్సీ సినిమా విషయంలో సెన్సార్ చెప్పిన సూచనలను స్వాగతిస్తున్నామన్నారు నటి కంగన రనౌత్. కానీ ఇప్పటికే కొందరు ప్రతిభావంతులు తమ సినిమాను చూసి ప్రశంసించారన్నారు. వారి ఆమోదం ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. ఈ స్క్రిప్ట్ ని తాము గౌరవించామని, అందుకే రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
09.Maggie: హ్యారీ పోటర్ నటి కన్నుమూత.
ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత మ్యాగీ స్మిత్ తుది శ్వాస విడిచారు. హ్యారీ పోటర్ సిరీస్‌లో పోషించిన ప్రొఫెసర్ మెక్ గొనగల్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు మ్యాగీ. ఎన్నో అద్భుత పాత్రలు పోషించిన ఆమె రెండు సార్లు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.