TOP9 ET: మనోళ్లను పొగిడిన హాలీవుడ్ స్టార్.. | సత్యభామకు తోడుగా బాలయ్య.
ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ బుజ్జి ఫోటోలతో .. వీడియోలతో నిండిపోయింది. కల్కి సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వెహికిల్ ఇప్పుడు కల్కి సినిమాకే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది. ఏకంగా ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా నోటీసుకు కూడా వెళ్లింది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిని ఈ బుజ్జి ఇంట్రడక్షన్ ఈవెంట్ ఫుల్ వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
01. bujji: అక్షరాల 7 కోట్లు ఖర్చు.. బుజ్జి ఇంట్రెస్టింగ్ వీడియో.
ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ బుజ్జి ఫోటోలతో .. వీడియోలతో నిండిపోయింది. కల్కి సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వెహికిల్ ఇప్పుడు కల్కి సినిమాకే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది. ఏకంగా ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా నోటీసుకు కూడా వెళ్లింది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిని ఈ బుజ్జి ఇంట్రడక్షన్ ఈవెంట్ ఫుల్ వీడియో ఇప్పుడు రిలీజ్ అయింది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో బుజ్జి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికి వచ్చాయి. పూర్తిగా scrapతో తయారైన ఈ వెహికిల్కి దాదాపు 7 కోట్లు ఖర్చు అయ్యాయనే టాక్ ఉంది ఇండస్ట్రీలో.
02.hema: ఏం చేసుకుంటారో చేసుకోండి.. హేమ వార్నింగ్.
బెంగుళూరు పోలీసులకు అడ్డంగా దొరికినా.. వీడియోలు రిలీజ్ చేస్తూ.. తాను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేందంటూ బుకాయిస్తూ వస్తున్న హేమ.. మరో సారి తన దరుసు మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసులో పాజిటివ్‌గా రావడంపై నటి హేమను ఓ మీడియా చానెల్ ప్రశ్నించగా కేర్‌లెస్‌గా ఆన్సర్ ఇచ్చారు. తాను ఇప్పుడేం మాట్లాడలేనంటూ.. సమయం వచ్చినప్పుడే మాట్లాడుతానంటూ చెప్పారు. అప్పటి వరకు ఏం చేసుకుంటారో చేసుకోండని నోరు జారారు. తన మాటలతో ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు.
03.RRR: మనోళ్లను పొగిడిన హాలీవుడ్ స్టార్.
ట్రిపులార్ సినిమా రిలీజ్ అయిన రెండేళ్లు దాటినా ఇప్పటికీ ఆ సినిమా మీద ప్రశంసలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ యాక్టర్ ఆన్ హాతవే కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి మాట్లాడారు. అందరి లాగే తనకు కూడా ట్రిపులార్ ఎంతో నచ్చింది అన్న ఆమె, ఆ టీమ్‌తో కలిసి పని చేయాలనుందన్నారు.
04.shruthihasan: ప్రస్తుతం నేను సింగిలే.. కుండబద్దలు కొట్టిన హీరోయిన్.
ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు శ్రుతిహాసన్. బోయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాతో ఇటీవల ఆమె విడిపోయారు. ఈ విషయాన్నే లేటెస్ట్ గా స్పష్టం చేశారు శ్రుతి. వర్క్ నీ, లైఫ్‌నీ బ్యాలన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 2023లాంటి సక్సెస్‌ఫుల్ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు శ్రుతి.
05.neha shetty: పిచ్చి పిచ్చి మీమ్స్ పై… రాధిక రియాక్షన్.
తన గురించి వచ్చే మీమ్స్ , ఆర్టికల్స్ ని చదవనని అంటున్నారు నటి నేహా శెట్టి. ఎవరైనా తనకు వాటిని ఫార్వర్డ్ చేస్తేనే చూస్తారట. చెడుగా రాసిన వార్తలు చదివితే మానసికంగా ఇబ్బంది తప్పదు. అందుకే, అలాంటి వార్తలకు దూరంగా ఉంటానని అన్నారు నేహాశెట్టి. ఆమె నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతోంది.
06.Nayanthara: గొడవలు గిడవలు ఏం లేవ్.. 5 సారి కూడా సెట్టు.
నయనతార, అజిత్ రేర్ రికార్డ్ సెట్ చేస్తున్నారు. ఈ జనరేషన్‌లో ఎంత సూపర్ హిట్ జోడీని అయిన ఒకటి రెండు సినిమాలకు మించి రిపీట్ చేయటం లేదు. కానీ అజిత్, నయన్‌ల జోడి ఏకంగా ఐదోసారి రిపీట్ కాబోతుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే టాక్ గత కొంత కాలంగా కోలీవుడ్‌లో ఉంది. ఈ క్రమంలోనే అజిత్ సినిమాలో నయనే హీరోయిన్‌గా ఫిక్స్ అవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
07.Vishwambara: ఆఫ్టర్ షాట్ గ్యాప్.. వెనక్కి వచ్చిన బాస్.
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న చిరు మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు. హైదరాబాద్‌లోనే తాజాగా మరో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించింది విశ్వంభర టీమ్. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. త్రిష హీరోయిన్.
08.Satyabhama: సత్యభామ తోడుగా బాలయ్య.
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా సత్యభామ. ముందు మే 31న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు యూనిట్. కానీ అనివార్య కారణాలతో సినిమాను జూన్ 7కి వాయిదా వేసారు. ఇదే విషయాన్ని చెప్తూ పోస్టర్ విడుదల చేసారు చిత్రయూనిట్. ఇక మే 24న సత్యభామ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరగనుంది. దీనికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నారు.
09.Pushpa 2: ఏంటి సామి? అంచనాలు అందుకుంటావా?
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి రెండో పాటకు ముహూర్తం సెట్ అయింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. తాజాగా రెండో సింగిల్‌కు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. మే 29 ఉదయం 11 గంటల 7 నిమిషాలకి ఈ సింగిల్ విడుదల కానున్నట్లు తెలిపారు మేకర్స్. అయితే అప్పుడే ఈ సాంగ్‌పై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.