TOP9 ET: టార్గెట్ రూ.1000 కోట్లు.. ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌ పోటీ.

TOP9 ET: టార్గెట్ రూ.1000 కోట్లు.. ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌ పోటీ.

Anil kumar poka

|

Updated on: Apr 12, 2024 | 9:54 PM

01.ntr: దిమ్మతిరిగే రేంజ్‌లో.. వీరిద్దరి మధ్య డ్యాన్స్‌ ఫోటీ.! యంగ్ టైగర్ ఎన్టీర్, బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్! ఈ ఇద్దరూ డ్యాన్స్‌లో కింగ్‌లే.. అలాంటి ఈ ఇద్దరూ.. ఓ సాంగ్‌లో డ్యాన్స్‌తో తలపడితే ఎలా ఉంటుంది. థియేటర్లు బద్దలయ్యే రేంజ్‌లో ..సిల్వర్ స్క్రీన్‌ చిరిగే రేంజ్లో ఉంటుంది కదా..! ఎగ్జాక్ట్‌గా ఇదే అనుకున్నారో ఏమో కానీ వార్ 2 మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జి.. ఈ ఇద్దరి మధ్య ఓ డ్యాన్స్‌ నెంబర్‌ను సెట్ చేశారట. […]

01.ntr: దిమ్మతిరిగే రేంజ్‌లో.. వీరిద్దరి మధ్య డ్యాన్స్‌ ఫోటీ.!

యంగ్ టైగర్ ఎన్టీర్, బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్! ఈ ఇద్దరూ డ్యాన్స్‌లో కింగ్‌లే.. అలాంటి ఈ ఇద్దరూ.. ఓ సాంగ్‌లో డ్యాన్స్‌తో తలపడితే ఎలా ఉంటుంది. థియేటర్లు బద్దలయ్యే రేంజ్‌లో ..సిల్వర్ స్క్రీన్‌ చిరిగే రేంజ్లో ఉంటుంది కదా..! ఎగ్జాక్ట్‌గా ఇదే అనుకున్నారో ఏమో కానీ వార్ 2 మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జి.. ఈ ఇద్దరి మధ్య ఓ డ్యాన్స్‌ నెంబర్‌ను సెట్ చేశారట. ఆ సాంగ్‌లో నాటు నాటు రేంజ్లో ఇద్దరితో దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్ చేయించేకు ప్లాన్ చేస్తున్నారట.

02.prabhas: టార్గెట్ 1000 కోట్లు.. ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్

100 కోట్ల లెక్క కామన్‌ అయిపోయింది. అందుకే వెయ్యి కోట్ల లెక్క తెరపైకి వచ్చింది. ఇప్పటికే బాహుబలి2తో వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసి.. టాలీవుడ్‌ కాలర్ ఎగరేసేలా చేసిన ప్రభాస్.. ఆ తరువాత మాత్రం..ఆ మార్క్‌ను అందుకోలేక పోయాడు. సలార్‌తో 700 కోట్ల వరకు రీచ్ అయినా.. వెయ్యి కోట్లను అందుకోలేకపోయాడు. దీంతో ప్రభాస్‌ కల్కి వెయ్యి కోట్లను రీచ్ అవ్వడమే టార్గెట్‌గా పెట్టుకుందనే టాక్ నడుస్తోంది. అందుకు తగట్టు ప్రమోషన్స్ ప్లాన్స్ జరుగుతుందనే న్యూస్ కూడా ఉంది. మరి ప్రభాస్‌ ఈ సారి కూడా వెయ్యి కోట్ల మార్క్‌ను రీచ్‌ అవుతారో లేదో చూడాలి.

03.pawan: అంత బిజీలోనూ చరణ్‌ను గౌరవాన్ని మెచ్చుకున్న బాబాయ్‌

ఎట్ ప్రజెంట్ రాజకీయాలతో.. పార్టీ మీటింగ్‌లతో .. ఎలక్షన్స్ ప్రచారాలతో చాలా బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్.. తన అన్న కొడుకు చరణ్‌ను మాత్రం గమనిస్తూనే ఉన్నారు. ఇక అందుకే అన్నట్టు చెర్రీకి చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా వచ్చిందనే న్యూస్ బయటికి వచ్చుడే ఆలస్యం.. అబ్బాయిని విష్‌ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషం అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. డాక్టరేట్ స్పూర్తితో మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించి, జనాల ఆదరణ పొందాలని ఆకాక్షించారు.

04.dj tillu: రంజాన్‌ పూట.. టిల్లు గాడికి దిమ్మతిరిగే కలెక్షన్స్‌.

టిల్లు గాడు స్టిల్ స్టడీగా.. కలెక్షన్స్‌ను రాబట్టుకుంటున్నాడు. వంద కోట్లను కూడా అవలీలగా దాటేలానే ఉన్నాడు. ఇప్పటికే తొమ్మిది రోజుల్లోనే100కోట్ల మార్క్‌ ను రీచై గ్రాండ్‌గా సక్సెస్ చేసుకున్న టిల్లు గాడు.. ఈద్‌ పండగ రోజు కూడా మంచి కలెక్షన్స్‌ రాబట్టాడు. ఇక 14వ రోజు రంజాన్ హాలిడే ఉండటంతో… టిల్లు స్క్వేర్ మంచి వసూళ్లు దక్కించుకుందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. 14 రోజుల్లో ఇండియా వైడ్‌గా 65 కోట్ల నెట్ రాబట్టినట్లు.. వరల్డ్ వైడ్​గా 61 కోట్ల వరకు షేర్ రాబట్టినట్టు టాక్.

05. samantha: అందాల అతి….

అతి సర్వత్రా వర్జయేత్ అంటారు మన పెద్దలు. అతి ఎందులోనూ పనికిరాదని చెబుతుంటారు ఎప్పుడూ..! కానీ ఆ పెద్దలు చెప్పే ఈ మాటలను ఇప్పుడు సమంతకు యాడ్ చేసి మరీ నెట్టింట కామెంట్ చేస్తున్నారు కొందరు.! ఎస్! ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటూ.. మయోసైటిస్ ట్రీట్మెంట్‌లో బిజీగా ఉన్న సమంత.. గ్యాబ్ దొరికితే చాలా తన ఇన్స్టాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోతోనే అందాల ఆరబోతను ఓ రేంజ్‌లో చేస్తున్నారు. ఇక రీసెంట్గా సూటు బూటులో ఫోటో షూట్ చేసి.. తన అందాల ప్రదర్శనతో నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. దాంతో పాటే అందాల అతి అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.

06.sreleela: చేజారుతున్న అవకాశాలు ఇక కష్టమే!

నిన్న మొన్నటి వరకు ఏ సినిమా చూసినా.. అందులో హీరోయిన్‌ శ్రీలీలనే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పవన్ ఉస్తాద్ మినహా.. మరే సినిమా.. శ్రీలీలకు అకౌంట్‌లో లేదిప్పుడు. పవన్ సినిమాతో పాటే.. విజయ్‌ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా కూడా తన ఖాతాలోనే ఉందని అనుకున్నా.. ఇప్పుడు లేని పరిస్థితి. ఎందుకంటే ఈ మూవీ నుంచి ఈ బ్యూటీని తప్పించారనే టాక్ వస్తోంది. కాదు కాదు ఈమెనె డేట్స్ ఇష్యూతో తప్పుకున్నారనే న్యూస్ ఉంది. కానీ ఏది ఏమైనా.. ఎప్పుడు షూటింగ్ అవుతుందో.. ఎప్పుడూ రిలీజ్ అవుతుందో తెలియని ఉస్తాద్ సినిమా తప్పా.. ఇప్పుడేవి ఈ బ్యూటీ ఖాతాలో లేదని మాత్రం సోషల్ మీడియాలో షాకింగ్ న్యూస్.

07.sai pallavi: 75 కోట్ల రెమ్యునరేషన్‌ బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి

ఇప్పటి వరకు ఏ సినిమాకైనా కోటి నుంచి రెండు కోట్ల మధ్య రెమ్యునరేషన్‌గా తీసుకునే సాయిపల్లవి బంపర్ ఆఫర్ కొట్టారు. ఈ సారి ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకోనున్నారు. బాలీవుడ్‌ మేకర్స్ నితిష్ తివారీ తెరకెక్కించే బిగ్ పాన్ ఇండియన్ సినిమా రామాయణ సినిమా కోసం ఈరేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోనున్నారట ఈ బ్యూటీ. ఇక రణ్బీర్‌ కపూర్ రాముడిగా యాక్ట్ చేస్తున్ ఈ మూవీ 3 భాగాలుగా తెరకెక్కనుంది.

08.avanthika: రంగుపై దారుణంగా ట్రోల్స్‌

నివురు గప్పిన నిప్పులా ఉంటూ.. ఎప్పుడో ఒకప్పుడు బయటి వస్తూనే ఉంటుంది రేసిజమ్. ఇక తాజాగా యంగ్ యాక్టరస్‌ అవంతిక కెరీర్‌ విషయంలోనూ ఇదే అడ్డుగా మారింది. తెలుగులో చైల్డ్‌ ఆర్టిస్ట్ గా చేసి.. ఇప్పుడు హాలీవుడ్‌ లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్న అవంతిక పై కొందరు రేసిజమ్ కామెంట్స్ చేస్తున్నారు. మీన్ గర్ల్స్‌ సినిమాతో పాపులర్ అయిన ఈమె.. మరో ప్రస్టేజియస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. డిస్నీ ఫేమస్ క్యారెక్టర్ ‘రపుంజెల్’ గా కనిపించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఆమె రంగును చూపుతూ.. ఈ క్యారెక్టర్ అవంతిక చేయడానికి వీల్లేదంటూ.. జాత్యాంహంకార కామెంట్స్చేస్తున్నారు కొంత మంది . ఆ క్యారెక్టర్‌ను తెల్లవాళ్లే చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

09.salman: స్టార్ హీరో ఇంటి ముందు లాఠీ ఛార్జ్‌

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ ఇంటి ముదు లాఠీ చార్జ్‌ జరిగింది. ఈద్ పండగ రోజు తన అభిమాన హీరోయిను చూడ్డానికి భారీగా అభిమానులు పోగయ్యారు. ఇక ఈక్రమంలోనే అక్కడ అభిమానుల తాకిడి ఎక్కువవడం.. పరిస్థితులు చేయి దాటుతుందనే సంకేతాలు రావడంతో.. పోలీసులు లాఠీలను పని చెప్పారు. సల్మాన్‌ ఇంటి ముందే సల్మాన్ అభిమానులను పోలీసులు లాఠీలతో పరిగెత్తించారు. అయితే సల్మాన్‌ ఫ్యాన్స్‌కు ఎలాంటి గాయాలు కాలేదని న్యూస్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..