TOP 9 ET: అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి త్వరలో దిమ్మతిరిగే న్యూస్.

TOP 9 ET: అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి త్వరలో దిమ్మతిరిగే న్యూస్.

Anil kumar poka

|

Updated on: Oct 10, 2024 | 10:57 AM

రామ్‌చరణ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాక, నీల్‌ ఈ సబ్జెక్టు మీద ఫోకస్‌ చేస్తారని న్యూస్‌. | కొన్ని సినిమాలు చూసినప్పుడు పక్కవారితో చర్చించుకుంటామన్నారు హీరో శ్రీవిష్ణు. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన శ్వాగ్‌ సినిమాను 90 శాతం మంది ఆస్వాదించారన్నారు.

01.Ram charan: చర్చలు ముగిశాయి.. త్వరలో దిమ్మతిరిగే న్యూస్.!

రామ్‌చరణ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాక, నీల్‌ ఈ సబ్జెక్టు మీద ఫోకస్‌ చేస్తారని న్యూస్‌.

02. Sri vishnu: వడ్డీతో చెల్లిస్తారా.?

కొన్ని సినిమాలు చూసినప్పుడు పక్కవారితో చర్చించుకుంటామన్నారు హీరో శ్రీవిష్ణు. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన శ్వాగ్‌ సినిమాను 90 శాతం మంది ఆస్వాదించారన్నారు. ఆ మిగిలిన పది శాతం మంది నెక్స్ట్ ప్రాజెక్టుతో ఫుల్‌ఫిల్‌ అవుతారని చెప్పారు.

03.Prabhas: అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి.!

మరోసారి వైరల్‌ అవుతోంది ప్రభాస్‌ పెళ్లి న్యూస్‌. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి… ప్రభాస్‌ పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెబుతామన్నారు. వధువుకు సంబంధించి వివరాలు ఇప్పుడే చెప్పదలచుకోలేదన్నారు. మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌.

04.rana: రానా నన్ను చూపుతో భయపెట్టాడు.

రానా పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా ‘బాహుబలి’. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎప్పుడో ఒకటి అనేంతలా నటిస్తున్నాడు. రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’లోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా రానా గురించి స్వయానా రజినీకాంత్ ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. రానా.. రామానాయుడి మనవడిగా చిన్నప్పటి నుంచి తెలుసన్న రజినీ కాంత్‌.. వేట్టయాన్‌లో ఓ సీన్‌లో.. రానా ఇచ్చిన సీరియస్ లుక్‌కు తాను నిజంగా భయపడిపోయా అంటూ చెప్పారు రజినీ. ఇక సూపర్‌స్టారే యాక్టింగ్ గురించి ప్రశంసించారంటే.. రానాకి ఇంతకంటే బెటర్ ఎలివేషన్ ఉండదేమో?

05.tumbad: స్టార్లు లేరు.. ఓవర్ యాక్షన్ లేదు అయినా రీ రిలీజ్‌లో దిమ్మతిరిగే రికార్డ్‌.

తుంబాడ్ సినిమాను సెప్టెంబర్ లో దేశమంతా రీరిలీజ్ చేయగా.. హారర్ అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఈ చిత్రంలో విడుదలైనప్పుడు రూ.16 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ ఇప్పుడు రీరిలీజ్ చేసిన తర్వాత ఏకంగా రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. సెకండ్ రిలీజ్ లో మొదటిసారి కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా దేశంలో ఏ స్టార్ హీరో సినిమా కూడా రీరిలీజ్ లో ఇంతగా కలెక్షన్స్ రాబట్టిన సందర్భాలు లేవు. కానీ స్టార్ హీరోలు లేకుండా వచ్చిన చిన్న సినిమా మాత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రీరిలీజ్ సినిమాగా తుంబాడ్ నిలిచింది.

06. Vamsi Paidipally: అమీర్‌తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమా.?

మన దగ్గర కొందరు దర్శకులున్నారు.. గ్యాప్ తీసుకున్నా సాలిడ్ ప్రాజెక్ట్‌తో వస్తుంటారు.. వంశీ పైడిపల్లి కూడా అదే చేస్తున్నారు.. వారసుడు తర్వాత ఈయన మరో సినిమాను ప్రకటించలేదు. ఈ మధ్యలో అమీర్ ఖాన్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి.

07.Karan Johar: సౌత్ డైరెక్టర్లకు గాడ్ ఫాదర్‌గా మారుతున్న కరణ్‌ జోహార్.

సౌత్ డైరెక్టర్లకు గాడ్ ఫాదర్‌గా మారుతోన్న కరణ్ జోహార్… తాజాగా మరో సౌత్‌ డైరెక్టర్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు. తమిళ్‌లో మండేలా, మావీరన్‌ లాంటి డిఫరెంట్ మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ హిందీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

08.bigg boss: బిగ్ బాస్ ఓటింగ్‌లో గంగవ్వ హవా.. దెబ్బకు మిగిలినోళ్లు షాకు.!

ఆఫ్టర్ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌.. ఈసారి బిగ్ బాస్ ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియలో షాకింగ్ రిజల్ట్ కనబడుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్స్ ఈ వారం ఓటింగ్ లో సత్తా చాటుతున్నారు. ఊహించని విధంగా గంగవ్వ ప్రస్తుతం బిగ్ బాస్ ఓటింగ్ లో టాప్ లో నిలిచారు. ఆమెకు సుమారు 30 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అలాగే రెండో ప్లేస్ లో ఉన్న విష్ణుప్రియకు 20 శాతం ఓట్లు పడ్డాయి.ఆ తర్వాత పృథ్వీకి 16 శాతం, యష్మి కి 14 శాతం, మెహబూబా దిల్సేకు 14 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇక చివరిగా కిర్రాక్ సీత కేవలం 7 శాతం ఓట్లతో డేంజర్ జోన్ లో నిలిచింది. కాగా కిర్రాక్ సీత టాప్ లో ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆమె ఏకంగా డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే సీత ఎలిమినేట్ అవ్వడం గ్యారంటీ.

09.taraka ratna: తారకరత్న భార్య, పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు.. అలేఖ్య ఎమోషనల్‌.

తారకరత్న మరణానంతరం తన పిల్లలే లోకంగా బతుకుతోంది అతని భార్య అలేఖ్య. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన భర్త, పిల్లల గురించి ఆసక్తికర పోస్టులను షేర్ చేస్తోంది. తద్వారా తన ఆవేదన, ఎమోషన్స్ ను అందరితో షేర్ చేసుకుంటోంది. అలాగే తరచూ తన ఫాలోవర్లతో క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహిస్తుంటుంది. అందులో అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా, సరదాగా సమాధానాలిస్తుంటుంది. అయితే తాజాగా ఓ నెటిజన్ తారకరత్న భార్య, పిల్లలపై నోరు పారేసుకున్నాడు. ‘ఇంత మందిని కనడం ఎందుకు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా ఇలాంటి మాటలు వింటే ఎవరికైనా కోపం నషాలానికి అంటుతుంది. కానీ అలేఖ్య మాత్రం సుతి మెత్తంగా మాట్లాడింది. ‘దయచేసి ఇలాంటి ద్వేషం వద్దు.. అందరికీ ప్రేమను పంచండి’ అంటూ నెటిజన్లను ఎమోషనల్‌గా వేడుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.