ఇదేం మేకోవర్ సామీ.. అస్సలు ఊహించలేదుగా

Edited By:

Updated on: Dec 21, 2025 | 5:16 PM

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కోసం మన హీరోలు భారీ మేకోవర్‌లకు సిద్ధమవుతున్నారు. ప్యాన్-ఇండియన్, ప్యాన్-వరల్డ్ చిత్రాలతో హాలీవుడ్‌కు పోటీ ఇస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్లు తమ పాత్రల కోసం దేహాన్ని మార్చుకుంటూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇది భారతీయ సినిమా కొత్త స్థాయికి చేరిన సంకేతం.

బడ్జెట్లు పెరుగుతున్నాయి.. మార్కెట్ పెరిగిపోయింది.. రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఇప్పుడు మన సినిమా మనం మాత్రమే కాదు ప్రపంచం అంతా చూస్తుంది. ఇలాంటి సమయంలో ఎప్పట్లాగే ఉంటే సరిపోదంటున్నారు మన హీరోలు. దానికోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. వరల్డ్ ఆడియన్స్ మెప్పుకోసం కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. ప్యాన్ ఇండియన్ సినిమా పోయి.. ప్యాన్ వరల్డ్ బొమ్మ వచ్చిందిప్పుడు. అందుకే హాలీవుడ్‌తో పోటీ పడాలన్నపుడు మన కటౌట్స్ కూడా అలాగే ఉండాలి కదా..! అదే చేస్తున్నారు మన హీరోలిప్పుడు. ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒక్కో సినిమా కోసం మన హీరోలు మారిపోతున్న తీరు అద్భుతహ. టాప్ స్టార్స్ అంతా ఇదే చేస్తున్నారు. వారణాసి కోసం బాగా మేకోవర్ అయిపోయారు మహేష్ బాబు. ఈయన లేటెస్ట్ లుక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పైగా అక్కడున్నది రాజమౌళి కాబట్టి ఓ పట్టాన వదలరు. అసలు మనం చూస్తున్నది మహేష్‌నేనా అనే అనుమానం వచ్చేంతగా మార్చేస్తున్నారు దర్శక ధీరుడు. వారణాసి టీజర్‌తోనే విషయం అర్థమైపోయింది. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్నారు. సాహో కోసం సన్నగా మారిన రెబల్ స్టార్.. రాధే శ్యామ్ కోసం రొమాంటిక్ టచ్ ఇచ్చారు. ఇక సలార్, కల్కిలో రఫ్ లుక్‌లోకి మారిపోయిన ప్రభాస్.. రాజా సాబ్ కోసం వింటేజ్ మేకోవర్ అయ్యారు. ఫౌజీలోనూ బరువు తగ్గి కొత్తగా కనిపించబోతున్నారీయన. స్పిరిట్ కోసం పోలీస్ లుక్‌లోకి మారిపోనున్నారు. పెద్ది కోసం ఎవరూ ఊహించని లుక్‌లోకి మారిపోయారు రామ్ చరణ్. ముక్కుకు పోగు.. గుబురు గడ్డం.. మీసాలు, కండలు తిరిగిన దేహం అన్నీ చూస్తుంటే అబ్బో మామూలుగా లేవు. పెద్ది పాత్ర పూర్తిగా ఓన్ చేసుకున్నారీయన. ఇక ప్రశాంత్ నీల్ కోసం తారక్ గుర్తు పట్టకుండా అయిపోయారు.. ఇక ప్యారడైజ్ కోసం ప్రాణం పెడుతున్నారు నాని. అట్లీ కోసం 3 గెటప్స్ ట్రై చేస్తున్నారు అల్లు అర్జున్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!

మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..

బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు

అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు

నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే

Published on: Dec 21, 2025 05:14 PM