ట్రెండింగ్ లో చికిరి, ఆయా షేర్ సాంగ్స్
టాలీవుడ్లో చికిరి సాంగ్ ఓ బెంచ్‌మార్క్‌గా నిలిచింది. అయితే, నాని 'ఆహా షేర్' సాంగ్ లైకుల విషయంలో చికిరిని అధిగమించి పోటీని పెంచింది. వ్యూస్‌లో చికిరి ఇంకా ముందుంది. ఈ రెండు బ్లాక్‌బస్టర్ పాటల మధ్య పోటీ ట్రేడ్ వర్గాలను ఆనందపరుస్తోంది. తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇలాంటి ఆరోగ్యకరమైన పోరు మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
ఏమాత్రం చడీచప్పుడూ లేకుండా సైడ్‌గా ఉంటే ఎవరు పట్టించుకుంటారు? రంగంలోకి దిగి దూసుకుపోతుంటే కదా నలుగురూ మనవైపు చూసేది. మనల్ని దాటాలనో, మనంతటి వాళ్లు కావాలనో కోరుకునేది. ఇప్పుడు టాలీవుడ్లో చికిరి సాంగ్ అలాంటి బెంచ్ మార్క్ అవుతోందా? చికిరిని టచ్ చేసే సాహసాన్ని షేర్ చేశాడా? ఇంట్రస్టింగ్ డీటైల్స్ చూసేద్దాం వచ్చేయండి… రీసెంట్ టైమ్స్ లో చార్ట్ బస్టర్ అయిన సాంగ్ చికిరి చికిరి. మేకింగ్ నుంచి, లిరిక్స్, స్టెప్స్ వరకు ప్రతి విషయాన్నీ సూపర్ అని మెచ్చుకున్నారు ఆడియన్స్. సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని వావ్ అనిపించింది చికిరి సాంగ్. రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్ నాలుగు నెలల్లో 13 లక్షలకు పైగా లైకులు తెచ్చుకుంది. అయితే ఈ పాట లైకులను రీసెంట్గా క్రాస్ చేసింది నాని ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ సాంగ్. అనిరుద్ స్వరపరచిన ఈ పాట నెల రోల్లో ఈ లైకులు తెచ్చుకోవడం సూపర్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్. ఇప్పటికి చికిరి సాంగ్‌కి 197 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. ఆయా షేర్‌కి 91 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. చికిరి సాంగ్ స్టాండర్డ్ వ్యూస్ తెచ్చుకుంటోంది. ఆయా షేర్‌కి స్టార్టింగ్‌లో ఉన్న దూకుడు ఇప్పుడు కాస్త తగ్గింది అనేది అబ్జర్వర్స్ చెబుతున్న మాట. ఏదేమైనా రెండు తెలుగు పాటలు లైకుల విషయంలో పోటీపోటీగా ఉండటం ఆనందంగా ఉందంటున్నారు ట్రేడ్ పండిట్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: ప్రేమపై త్రిష పోస్టు.. ట్రెండింగ్ లో లవ్ కోట్స్
తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్ కాదు.. కొత్తగా ప్యాచప్..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

