Fish Venkat: దారుణంగా ఫిష్ వెంకట్‌ ఆరోగ్య పరిస్థతి.! సాయం కోసం వేడుకోలు
Tollywood Senior Actor Fish Venkat Suffering From Severe Health Issues Asking For Medical Help, Details Here Telugu Entertainment Video

Fish Venkat: దారుణంగా ఫిష్ వెంకట్‌ ఆరోగ్య పరిస్థతి.! సాయం కోసం వేడుకోలు

|

Sep 05, 2024 | 12:12 PM

టాలీవుడ్ లో కామెడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అతను తన యాస, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2000లో సమ్మక్క సారక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫిష్ వెంకట్ ఇప్పటివరకు వందలాది సినిమాల్లో నటించాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించడం లేదు.

టాలీవుడ్ లో కామెడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అతను తన యాస, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2000లో సమ్మక్క సారక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫిష్ వెంకట్ ఇప్పటివరకు వందలాది సినిమాల్లో నటించాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించడం లేదు. అతను చివరిసారిగా గతేడాది రిలీజైన నరకాసుర సినిమాలో కనిపించాడు. అంతకు ముందు కూడా అడపా దడపా మాత్రమే మూవీస్ లో కనిపించాడు. అయితే గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలోనే తన కుటుంబం దీన స్థితిలో ఉందని, ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

“ఆయాసం బాగా రావడంతో ఇటీవల ఆస్పత్రికి వెళ్లాను. అయితే అక్కడ వారం రోజులు చికిత్స అందించిన తర్వాత డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారు. అదేంటో మాకు అసలు తెలీదు. ఎందుకైనా మంచదని నిమ్స్ లో జాయిన్ అయ్యి.. అక్కడే డయాలసిస్ చేయించుకుంటున్నాను. సుమారు ఏడాదిన్నర కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాలుగేళ్ల క్రితం కాలికి చిన్న దెబ్బ తగిలింది. అదే టైమ్ లో బీపీ, షుగర్ కూడా రావడంతో కాలు మెుత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. డాక్టర్లు ఆపరేషన్ కూడా చేశారు. అప్పటి నుంచి నా పరిస్థితి ఇలా అయిపోయింది. రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎన్ని సినిమా ఛాన్స్ లు వచ్చినా వెళ్లలేకపోతున్నాను. డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను. ప్రస్తుతం నా కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉంది” అని భావోద్వేగానికి లోనయ్యాడు ఫిష్ వెంకట్. ఎన్నో సినిమాల్లో తన కామెడీ విలనిజంతో కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అతని దీన పరిస్థితి చూసి.. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.