Tollywood : ఉదయాన్నే ఓటు వేసేందుకు క్యూ కట్టిన సినీ తారలు.. అల్లు అర్జున్, జూ. ఎన్టీఆర్ సహా..

|

May 13, 2024 | 8:48 AM

ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్  ఎన్టీఆర్, చిరంజీవి లాంటి సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూ.ఎన్టీఆర్ తన ఫ్యామీలితో కలిసి ఉదయాన్నే జూబ్లీహిల్స్‌ కేంద్రానికి చేరుకున్నారు.అలాగే అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ అన్నారు.

ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. ఉదయం నుంచి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్  ఎన్టీఆర్, చిరంజీవి లాంటి సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూ.ఎన్టీఆర్ తన ఫ్యామీలితో కలిసి ఉదయాన్నే జూబ్లీహిల్స్‌ కేంద్రానికి చేరుకున్నారు.అలాగే అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ అన్నారు. కావాల్సిన వాళ్లకు పార్టీతో సంబంధం లేకుండా మద్దతిస్తానని అల్లు అర్జున్ తెలిపారు.. ఎన్నికల్లో నిలబడితే మద్ధతిస్తానని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి గతంలో చెప్పానని తెలిపారు. ఆ క్రమంలోనే నంద్యాల వెళ్లి రవికి మద్దతు తెలిపానని అల్లు అర్జున్ అన్నారు. మరికొందరు సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బయలు దేరారు.

Published on: May 13, 2024 08:38 AM