Watch: తిరుమల శ్రీవారి సేవలో పూజా హెగ్డే.. వీడియో చూశారా?

ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం(ఏప్రిల్ 4న) శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా గురువారంనాడు ఆమె శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలు చేశారు.

ప్రముఖ సినీ నటి పూజా హెగ్డే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం(ఏప్రిల్ 4న) శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. కాగా గురువారంనాడు ఆమె శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలు చేశారు. పూజా హెగ్డే తమిళంలో నటించిన రెట్రో మూవీ విడుదలకు రెడీగా ఉంది. హీరో సూర్య నటించిన ఈ సినిమా మే 1న దేశ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.