అమర జవాన్ కుంటుంబానికి ఆర్థిక సాయం.. చిన్న హీరోయిన్ పెద్ద మనసు !!
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కొన్ని రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ లో సైనికుడిగా విధులు నిర్వహిస్తోన్న మురళీ నాయక్ అమరుడయ్యాడు. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సైనికుడిగా దేశానికి సేవ చేయాలని 2022లో అగ్నివీర్ గా సైన్యంలో ఆర్మీలో చేరాడు మురళీ నాయక్. ఆపరేషన్ సింధూర్ ముందు వరకు వేరే చోట పనిచేస్తోన్న ఈ జవాన్ భారత్- పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో కశ్మీర్ కు వచ్చాడు.
లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పహరా కాస్తూ శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు మురళీ. ఈ విషాదం నుంచి అతని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే మురళి నాయక్ కుంటుంబాన్ని ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి, ఆ అమర జవాన్‌కు నివాళులు అర్పించడానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతని స్వగ్రామానికి తరలి వస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మిత్రా శర్మ కూడా మురళి ఇంటికి వెళ్లారు. మురళీ నాయక్ సమాధి దగ్గర నివాళులు అర్పించడంతో పాటు.. ఆయన కుంటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేశారు. కళ్లితాండలో ఉన్న మురళీ తల్లిదండ్రులని కలిసి ధైర్యం చెప్పారు మిత్రా శర్మ. దేశం ఒక గొప్ప వీరుడ్ని కోల్పోయిందని.. ఇలాంటి వీరుడి కుటుంబానికి దేశమంతా ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు ఆమె. ఈ సందర్భంగా మురళీ తల్లిదండ్రులకు తనకు తోచిన ఆర్థిక సాయం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ మిత్రా పోస్ట్ చేయడంతో.. ఇవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింపుల్ శారీ అనుకోకండి.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు
చెత్త సినిమా కోసం.. 700cr హిట్ సినిమా వదులుకుంది..
32ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాలో విజయశాంతి

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
