చెత్త సినిమా కోసం.. 700cr హిట్ సినిమా వదులుకుంది..
ఇప్పుడున్న యంగ్ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా అరడజను సినిమాలను లైనప్ చేస్తున్నారు. యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటున్నారు. కుర్ర హీరోయిన్స్ జోరుకు కొంతమంది సీనియర్ హీరోయిన్స్ వెనకబడుతున్నారు.
అయితే అవకాశాల రావడమే కష్టంగా మారిన సమయంలో హీరోయిన్ కీర్తి సురేష్ క్రేజీ ఆఫర్ ను మిస్ చేసుకుంది. ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా రూ. 700కోట్ల సినిమాను వదులుకుంది. కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లోనూ సినిమా చేసింది కీర్తి. బేబీ జాన్ అనే సినిమాతో అక్కడ పరిచయం అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా కోసం కీర్తి ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇటీవల ఛావా సినిమా విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దేహవ్యాప్తంగా ఛావా సినిమా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేసింది. అయితే ముందుగా హీరోయిన్ పాత్ర కోసం కీర్తిసురేష్ ను సంప్రదించారట మేకర్స్. అయితే ఆ సమయంలో బేబీ జాన్ సినిమాతో బిజీగా ఉండటంతో ఆమె నో చెప్పిందని తెలుస్తుంది.అయితే ఇప్పుడీ న్యూస్ బయటికి వచ్చి… అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
32ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాలో విజయశాంతి
జోరు మీదున్న జాన్వీ.. కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తుందిగా
NTRకు లింక్ చేస్తూ.. హీరోయిన్‌పై RGV వెకిలి కామెంట్స్
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

