Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నైట్ పార్టీకి వెళ్లింది.. స్కాంలో చిక్కుకుంది.. పాపం కయాదు

నైట్ పార్టీకి వెళ్లింది.. స్కాంలో చిక్కుకుంది.. పాపం కయాదు

Phani CH

|

Updated on: May 23, 2025 | 3:56 PM

కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

ఈ క్రమంలోనే ఇప్పుడు కాయదు లోహర్ ఊహించని చిక్కుల్లో పడింది. టాస్మాక్ స్కామ్ తో సంబంధం ఉన్న నిందితులు నిర్వహించిన నైట్ పార్టీలో ఈ భామ పాల్గొన్నట్లు తెలిసింది. దాంతో ఈ న్యూస్ కోలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది. ఎస్ ! కాయదు లోహర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్ లో తెగ వైరల్ అవుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర మద్యం సంస్థ TASMAC స్కామ్‌తో సంబంధం కలిగి ఉన్నాయని సమాచారం. ED దాడుల సమయంలో కాయదు లోహర్ ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నట్లు తేలింది. అంతే కాదు ఈ బ్యూటీ స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైందని కూడా వెలుగులోకి వచ్చింది. అంతే కాదు ఒక్కో పార్టీకి కాయదు సుమారు రూ. 35 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఈడీ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సోషల్ మీడియా పోస్ట్‌లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్కీ గర్ల్.. బిగ్ బాస్‌9 లోకి పచ్చళ్ల పాప

25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు

51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు