కుర్ర హీరోలకు క్లాష్ కష్టాలు.. రిలీజ్ డేట్ గొడవలు తప్పవా ??

Edited By: Phani CH

Updated on: Oct 30, 2025 | 3:20 PM

భారీ చిత్రాలు ఎంత ఆలస్యమైనా ఆ హైప్ అలాగే కొనసాగుతుంది. అదే చిన్న చిత్రాలైతే డేట్‌ కుదరకపోతే వాయిదా వేసుకొని కొత్త డేట్‌కు వెళ్లిపోతాయి. కానీ మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి అలా ఉండదు. చెప్పిన డేట్‌కు సినిమా రాకపోతే ఆ ఎఫెక్ట్ భారీగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరోలు చాలా మందే కనిపిస్తున్నారు.

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్‌. వరుస సూపర్ హిట్స్‌తో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకున్న శేష్‌, డెకాయిట్ రిలీజ్ విషయంలో తడబడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఏకంగా నెక్ట్స్ ఇయర్‌ మార్చి 19కి వాయిదా పడింది. ఆల్రెడీ అదే డేట్‌కు టాక్సిక్‌ బరిలో ఉంది. మరో యంగ్ హీరో నాని కూడా ఇలాంటి సిచ్యుయేషన్‌లోనే ఉన్నారు. ది ప్యారడైజ్ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో సిద్ధం చేస్తున్న నాని, ఆ సినిమాతో నేషనల్ మార్కెట్‌లోనూ సత్తా చాటాలని గట్టిగా కష్టపడుతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మార్చి 26న సినిమాను రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు. కానీ ఒక్క రోజు గ్యాప్‌లో రామ్ చరణ్‌ పెద్ది రిలీజ్ అవుతుండటంతో ఎవరు వెనక్కు తగ్గుతారన్న చర్చ జరుగుతోంది. మరో వైపు పాన్ ఇండియా అటెంప్ట్స్ చేస్తున్న మరికొంత మంది హీరోలకు అసలు రిలీజ్ డేట్సే దొరకటం లేదు. స్వయంభూ, ది ఇండియా హౌస్ సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్ ఆ సినిమా రిలీజ్‌ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అఖిల్‌, నాగచైతన్య, నితిన్ లాంటి చాలా మంది యంగ్ హీరోలు ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్‌లోనే ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా

Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల

Krrish 4: క్రిష్‌ మూవీలో జాకీచాన్‌.. డీల్‌ ఓకేనా

‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా

నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే

Published on: Oct 30, 2025 02:58 PM