AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Subbaraju: 46 యేళ్లు వచ్చినా పెళ్లి లేదు.! అడిగితే క్లాసిస్తున్న స్టార్.

Subbaraju: 46 యేళ్లు వచ్చినా పెళ్లి లేదు.! అడిగితే క్లాసిస్తున్న స్టార్.

Anil kumar poka
|

Updated on: Apr 07, 2024 | 1:51 PM

Share

టాలీవుడ్‌లో ఉన్న ఆరడుగుల కటౌట్లలో.. నటుడు సుబ్బరాజు కూడా ఒకరు. హీరో ఫీచర్స్ పుష్కలంగా ఉన్న ఆయన.. ఎందుకో ఏమో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయ్యారు. కేవలం తెలుగు మాత్రమే కాదు.. తమిళ, హిందీ, మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించాడు ఈ యాక్టర్. ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేస్తాడన్న పేరు ఉంది. ఫిట్‌నెస్ విషయంలో కూడా రాజీ పడరు.

టాలీవుడ్‌లో ఉన్న ఆరడుగుల కటౌట్లలో.. నటుడు సుబ్బరాజు కూడా ఒకరు. హీరో ఫీచర్స్ పుష్కలంగా ఉన్న ఆయన.. ఎందుకో ఏమో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయ్యారు. కేవలం తెలుగు మాత్రమే కాదు.. తమిళ, హిందీ, మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించాడు ఈ యాక్టర్. ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేస్తాడన్న పేరు ఉంది. ఫిట్‌నెస్ విషయంలో కూడా రాజీ పడరు. డైలీ వర్కవుట్స్ చేస్తూ.. ఎంతోమందికి ఫిట్‌నెస్ గోల్స్ విసురుతూ ఉంటారు. కానీ పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం తన దగ్గర ఉన్న థియరీ చెబుతూ అందర్నీ ఆకట్టుకుంటారు. సుబ్బరాజు వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇదే విషయాన్ని ఆయన్ని అడిగితే.. మ్యారేజ్ అసలు ఎందుకు చేసుకోవాలో తనకు అర్థం కాలేదని కొత్త తత్వాన్ని చెప్పుకొచ్చారు. “ఏదైనా పని చేయడానికి కారణం ఉంటుంది. ఈ పని చేయలేదు.. దానికి కారణం ఏంటి అంటే.. ఏమని చెప్తాం. మ్యారేజ్ చేసుకోకపోవడానికి నా వద్ద ఉన్న ఆన్సర్ ఇదే. నా అభిప్రాయం ప్రకారం పెళ్లి జరగకూడదు. మనకు అనిపించినప్పుడు చేసుకోవాలి. 25, 30 ఏళ్లు వచ్చాయ్ అని.. అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయ్ అని.. తల్లిదండ్రుల ఒత్తిడి ఉందని.. పెళ్లి చేసుకోకూడదు. నా జీవితం, మనస్సును ఒక అమ్మాయికి పూర్తిగా ఇవ్వగలను అని నమ్మకం వచ్చినప్పుడు నేను పెళ్లి గురించి థింక్ చేస్తాను. మ్యారేజ్ చేసుకుని.. ఇది వర్కువుట్ అవ్వకపోతే ఇంకొకటి అన్నది నా మెంటాలిటీ కాదు. ఏదో కారు, ఇల్లు లాంటిది కాదు పెళ్లి. అందుకే పెళ్లిళ్లు జరక్కూడదు. చేసుకోవాలి” అంటూ తన స్టైల్‌లో చెప్పుకొచ్చారు సుబ్బరాజు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Apr 07, 2024 01:33 PM