టాలీవుడ్ నిర్మాతలకు వరంగా మారుతున్న ఆ హీరోలు
టాలీవుడ్‌లో స్టార్ హీరోల కొరత కారణంగా, కొత్త తరం యువ నటులు కీలకమయ్యారు. తేజ సజ్జా, రోషన్ మేక, నవీన్ పొలిశెట్టి వంటివారు ఇప్పుడు నిర్మాతలకు బ్యాంకబుల్ స్టార్లుగా ఎదుగుతున్నారు. హనుమాన్ బ్లాక్‌బస్టర్‌తో తేజ అగ్రస్థానంలో ఉండగా, రోషన్, నవీన్ సైతం తమదైన మార్కెట్‌ను సృష్టించుకుంటున్నారు. ఈ యువ కెరటాలు టాలీవుడ్ భవిష్యత్తుకు ఆశాకిరణాలుగా మారుతున్నాయి.
టాలీవుడ్‌లో హీరోలు తక్కువగా ఉన్నారని ఎప్పడైనా అనుకున్నారా..? అదేంటి అంత మాట అనేసారు.. ఇంతమంది హీరోలున్నారు కదా అనుకోవచ్చు. కానీ అన్ని సినిమాలు అందరు హీరోలకు వర్కవుట్ అవ్వవు కదా. ఇక్కడ నిర్మాతలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. వాటికి తగ్గ హీరోలే కావాలి. అలాంటి బ్యాచ్చే ఒకటి టాలీవుడ్‌లో రెడీ అవుతుందిప్పుడు. మరి వాళ్లెవరో చూద్దామా..? స్టార్ హీరోలు అందరికీ దొరకరు.. మీడియం రేంజ్ హీరోలు కూడా బిజీగానే ఉన్నారు.. అందుకే టాలీవుడ్‌లో నిర్మాతలకు బ్యాంకబుల్‌గా మరో బ్యాచ్ రెడీ అవుతుంది. కథ బాగుంటే వాళ్లపై బడ్జెట్ కూడా బాగానే ట్రై చేయొచ్చు. ఈ లిస్టులో తేజ సజ్జా అందరికంటే ముందుంటే.. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక.. నవీన్ పొలిశెట్టి సైతం ఆయన తర్వాత చేరిపోయారు. తాజాగా ఛాంపియన్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు రోషన్. పెళ్లి సందడి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని వచ్చినా.. ఫస్ట్ డే ఈ సినిమాకు 4.5 కోట్ల గ్రాస్ వచ్చింది. కాస్త స్లోగా ఉందనే టాక్ ఉన్నా.. వీకెండ్ నాటికి సెట్టయ్యేలా కనిపిస్తుంది. కంటెంట్ కరెక్టుగా పడితే.. రోషన్ కచ్చితంగా పెద్ద స్టార్ అవుతారనడంలో సందేహం లేదు. లుక్స్ ఈయనకు మేజర్ ప్లస్. నవీన్ పొలిశెట్టి సైతం తనదైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. మరో హిట్ పడితే.. నవీన్‌పై 40 కోట్లు కూడా వర్కవుట్ అవుతాయి. ఇక తేజ సజ్జా ఆల్రెడీ నిర్మాతలకు బంగారు బాతు. హనుమాన్‌తో 300 కోట్లు, మిరాయ్‌తో 140 కోట్లకు పైగా వసూలు చేసారీయన. మొత్తానికి స్టార్ కాని స్టార్ హీరోల్లా మారిపోతున్నారు ఈ కుర్ర హీరోలంతా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్
Jailer 02: జైలర్ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
విద్యుత్ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
