Teja Sajja - Mirai: యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్ గా..

Teja Sajja – Mirai: యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్ గా..

Anil kumar poka

|

Updated on: Apr 19, 2024 | 12:36 PM

హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ మూవీతో ఇటు సౌత్.. అటు నార్త్ అడియన్స్‏ను మెప్పించాడు. ఇక ప్రస్తుతం హనుమాన్ మూవీ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జై హనుమాన్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీ్ట్ కాగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ మూవీతో ఇటు సౌత్.. అటు నార్త్ అడియన్స్‏ను మెప్పించాడు. ఇక ప్రస్తుతం హనుమాన్ మూవీ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జై హనుమాన్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీ్ట్ కాగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా తేజ తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈసారి మరో హిస్టారికల్ మూవీ మిరాయ్‌తో మన ముందుకు వస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్‌ అయిన గ్లింప్స్‌తో ఇప్పుడు అందర్లో గూస్ బంప్స్‌ పుట్టిస్తున్నాడు.

ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న మిరాయ్‌ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తేజా సజ్జా, రితికా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక రీసెంట్గా హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో.. ఈ మూవీ నుంచి టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో తేజా సజ్జా.. సూపర్ యోధ పాత్రలో కనిపించనున్నారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు టైటిల్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, హిందీతోపాటు చైనీస్ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!