ప్రూవ్ చేసుకునేందుకు స్టార్ వారసుల కష్టాలు

Edited By: Phani CH

Updated on: Oct 30, 2025 | 3:19 PM

ఇండస్ట్రీలో నెపోటిజంకు సంబంధించిన డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ వారసులుగా పరిచయం అయిన వాళ్లకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. తెర మీద సక్సెస్ అవ్వటం వాళ్లకు చాలా ఈజీ అన్నది అందరి అభిప్రాయం, మరి ఈ ఒపీనియన్ అందరి విషయంలో కరెక్టేనా..? స్టార్ వారసులుగా వచ్చి వెండితెర మీద సక్సెస్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు.

అలాగే తిరుగే లేని బ్యాక్‌గ్రౌండ్‌తో సిల్వర్‌ స్క్రిన్ ఎంట్రీ ఇచ్చి ఇంకా సక్సెస్‌ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోలు కూడా లేకపోలేదు. రీసెంట్‌గా బైసన్‌ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ధృవ్‌ను చూసిన తరువాత ఈ డిస్కషన్‌ ఎక్కువగా జరుగుతోంది. విలక్షన్‌ నటుడు విక్రమ్ వారసుడిగా పరిచయం అయిన ధృవ్‌ తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ రేంజ్‌లో స్పీడు మాత్రం చూపించలేకపోతున్నారు. మహాన్‌ సినిమాలో తండ్రితో పోటీ పడి నటించినా… వరుస అవకాశాలు రాలేదు. ఇప్పుడు బైసన్ సినిమాతో మరోసారి తన వర్సటాలిటీని ప్రూవ్ చేసుకొని బిజీ అయ్యేందుకు కష్టపడుతున్నారు ధృవ్‌. మాలీవుడ్‌లోనూ ఇలాంటి స్టార్ కిడ్ ఒకరున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తనయుడు, ప్రణవ్ మోహన్‌లాల్‌ బిగ్ బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. హృదయం సినిమాతో హిట్ అందుకున్న ప్రణవ్‌ తరువాత స్పీడు చూపించలేకపోయారు. అందుకే నెక్ట్స్ మూవీ డియాస్ ఇరాయ్‌తో తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు.టాలీవుడ్ స్టార్ వారసుడు అఖిల్‌ కూడా ఇదే సిచ్యుయేషన్‌లో ఉన్నారు. అక్కినేని వారసుడిగా పరిచయం అయినా… కెరీర్‌లో ఇంట్రస్టింగ్ సినిమాలు చేసినా… అఖిల్ కెరీర్‌లో బిగ్ బ్రేక్ మాత్రం ఇంత వరకు రాలేదు. అందుకే అప్‌ కమింగ్ మూవీ లెనిన్‌ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అఖిల్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా

Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల

Krrish 4: క్రిష్‌ మూవీలో జాకీచాన్‌.. డీల్‌ ఓకేనా

‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా

నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే

 

Published on: Oct 30, 2025 03:12 PM