ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్.. ఏం చెప్పారంటే?
ఆరోగ్యం-సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే ‘సూద్ చారిటీ ఫౌండేషన్’... రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు నటుడు, ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు.
అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య చికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
వైరల్ వీడియోలు
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష
ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ
వెబ్సైట్లు,యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అత్తను హత్య చేసిన కోడలు
ఫేక్ ర్యాపిడో యాప్‌తో క్యాబ్ డ్రైవర్ మోసం
రోడ్డు పక్కనే 2వేల నాటు కోళ్లు ప్రత్యక్షం.. కట్ చేస్తే..
కొడుకు మృతిని తట్టుకోలేక ప్రాణం విడిచిన తండ్రి..
