లావణ్య -రాజ్ తరుణ్ వ్యవహారంలో వెలుగులోకి సంచలన నిజాలు

లావణ్య -రాజ్ తరుణ్ వ్యవహారంలో వెలుగులోకి సంచలన నిజాలు

Samatha J

|

Updated on: Feb 04, 2025 | 9:19 PM

లావణ్య-రాజ్‌తరుణ్‌ కేసులో మస్తాన్‌ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. పలువురు యువతుల అభ్యంతరకరమైన వీడియోలను రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి.లావణ్య వీడియోలను కూడా మస్తాన్‌సాయి షూట్ చేశాడు. ఆ వీడియోలను లావణ్య పోలీసులకు అందించారు. హార్డ్‌డిస్క్ కోసం లావణ్య ఇంటికి వెళ్లారు మస్తాన్‌ .

హార్డ్‌డిస్క్‌ ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మస్తాన్‌ నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్‌ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. మస్తాన్‌ సాయి హార్డ్‌డిస్క్‌లో 200లకు పైగా వీడియోలను గుర్తించారు. గతంలో డ్రగ్స్‌ కేసులో మస్తాన్‌ సాయి అరెస్ట్‌ అయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణిత అందిస్తారు.