Singer Sunitha: మరోసారి ప్రెగ్నెంట్ వార్తలపై స్పందించిన సింగర్ సునీత..! ఈసారి క్లారిటీ..
ప్రముఖ సింగర్ సునీత గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె త్వరలో తల్లి కాబోతుందన్న రూమర్లు తెగ సర్క్యూలేట్ అవుతున్నాయి. అయితే ఆమెపై
ప్రముఖ సింగర్ సునీత గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె త్వరలో తల్లి కాబోతుందన్న రూమర్లు తెగ సర్క్యూలేట్ అవుతున్నాయి. అయితే ఆమెపై ఇలా పుకార్లు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తోన్న సునీత తాజా రూమర్లపై స్పందించారు.. ‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు’ అంటూ తనపై వస్తోన్న వార్తలకు చెక్ పెట్టారు స్టార్ సింగర్. కాగా ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్ వేదికగా మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత తన ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేశారు. అంతేకాదు ఈ కన్సర్ట్‌లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తన అభిప్రాయాలను పంచుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..