Polimera 2 Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొలిమేర2 ట్రైలర్.. ప్యాంట్ లో పడిపోతున్నాయి కామెంట్స్.

Polimera 2 Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొలిమేర2 ట్రైలర్.. ప్యాంట్ లో పడిపోతున్నాయి కామెంట్స్.

Anil kumar poka

|

Updated on: Oct 15, 2023 | 6:06 PM

నేరుగా ఓటీటీలో వచ్చిన ‘మూ ఊరి పొలిమేర’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాట్‌స్టార్‌ వేదికగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసింది. ఎప్పుడూ కామెడీ రోల్స్‌తో ఆకట్టుకునే సత్యం రాజేష్‌ తొలిసారి పూర్తి స్థాయి సీరియస్ రోల్‌లో నటించి మెప్పించాడు. చేతబడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో హైయస్ట్ వ్యూస్‌ సాధించింది.

నేరుగా ఓటీటీలో వచ్చిన ‘మూ ఊరి పొలిమేర’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాట్‌స్టార్‌ వేదికగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసింది. ఎప్పుడూ కామెడీ రోల్స్‌తో ఆకట్టుకునే సత్యం రాజేష్‌ తొలిసారి పూర్తి స్థాయి సీరియస్ రోల్‌లో నటించి మెప్పించాడు. చేతబడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో హైయస్ట్ వ్యూస్‌ సాధించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘మా ఊరి పొలిమేర2’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 3వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. 2.07 నిమిషాల నిడివి ఉన్న సినిమా ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ సీక్వెల్ చిత్రం కూడా చేతబడులు నేపథ్యంలో తెరకెక్కినా ఇందులో ఔ కథంతా ఓ గుడి చుట్టూ జరగనున్నట్లు అర్థమవుతోంది. ఓ పురాతన గుడిలో ఉన్న మిస్టరీని కథాంశంగా తీసుకొని చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. ట్రైలర్‌ను చూస్తే ఈ సినిమా కథ మహబూబ్‌ నగర్‌ నేపథ్యంగా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఇక ట్రైలర్‌లో వచ్చిన డైలాగ్స్‌ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా.. ‘ప్రతీ గుడికి ఒక హిస్టరీ ఉంటుంది. మీ ఊరి గుడి మాత్రం మిస్టరీగా ఉంది. స్వార్థంతో చేస్తే హత్య, ఆశయంతో చేస్తే యుద్ధం. స్వార్థంతో చేసే ఏ యుద్ధంలో అయినా ఆశే ఉంది కానీ ఆశయం ఎక్కడుంది’. లాంటి డైలాగ్స్‌ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..