Samantha: భూతశుద్ధి ప్రక్రియలో పెళ్లి.. ఈ పెళ్లి విశిష్టత ఏంటంటే ??
అగ్రకథానాయిక సమంత, రాజ్ నిడిమోరును భూత శుద్ధి వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో జరిగిన ఈ వేడుకలో పంచభూతాలను శుద్ధి చేస్తారు. ఇది లోతైన బంధాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే ప్రాచీన యోగ సంప్రదాయం. ఈ విభిన్న వివాహ పద్ధతి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అగ్రకథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి జరిగింది. అది కూడా భూత శుద్ధి అనే విశిష్ఠ ప్రక్రియ ద్వారా రాజ్‌ను పెళ్లి చేసుకుంది సమంత. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సామ్. ఇక పెళ్లిలో సమంత ఎర్రచీర, రాజ్ క్రీమ్ – గోల్డ్ కలర్ కుర్తాతో చూడముచ్చటగా ఉన్నారు ఈ స్టార్ కపుల్. ఇక సమంత-రాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈశా ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. అందులో వీరు భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఈ వివాహ విధానం గురించి అందరూ వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్ఠమైన ప్రక్రియే ఈ ‘భూత శుద్ధి వివాహం’. లింగ భైరవి ఆలయాల్లో, ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు.. వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఈశా ఫౌండేషన్ తమ ప్రకటనలో వివరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rohit Sharma: వరల్డ్ రికార్డ్ కొట్టిన రోహిత్ శర్మ
Today Gold Price: సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా..!
ఫ్లెమింగో ఒంటి కాలి జపం కథేంటో తెలుసా..?
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

