Samantha: ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..

|

Dec 12, 2024 | 10:29 AM

2025లో తనను ప్రేమించే భాగస్వామి కావాలని సమంత కోరుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో తనకేం కావాలో సూచనప్రాయంగా చెబుతూ ఓ పోస్ట్‌ పెట్టారు. సమంత తాజాగా పెట్టిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. తన రాశికి 2025 ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. అందులో చెప్పిన విధంగా జరగాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

‘వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆ పోస్ట్‌లో ఉంది. వారు ఆ ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు వృత్తి పరంగా మెరుగుపడతారు డబ్బు ఎక్కువగా సంపాదిస్తారనీ జ్యోతిష్యుల అంచనా. ఆర్థికంగా బలంగా ఉంటారు, నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు, ఆదాయ మార్గాలు పెంచుకుంటారు, మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటారు, మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉంటారు, పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచే జరగాలని అభిమానులు కామెంట్ పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘సిటడెల్‌’తో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఇప్పుడు తన రాబోయే సిరీస్‌ కోసం ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’కి ది బ్లడీ కింగ్‌డమ్‌ అనేది ఉపశీర్షిక. ‘తుంబాడ్‌’ ఫేమ్‌ రాహి అనిల్‌ బార్వే దర్శకుడు. తాజాగా ఈ సిరీస్‌ సెట్లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫొటోను పంచుకున్నారు. ‘మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి వచ్చేశా’ అని వ్యాఖ్యల్ని జోడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.