Tiger Nageshwar Rao Review: రవితేజ అలియాస్ టైగర్ నాగేశ్వరరావు.. హిట్టా..? ఫట్టా..?
ఎప్పుడూ మాస్ మాసాలా.. సినిమాలు చేసే మాస్ రాజా రవితేజ.. ఆ సారి తన జానర్ మార్చి చేసిన ఫిల్మ్ టైగర్ నాగేశ్వరరావు. వంశీ డైరెక్షన్లో.. పీరియాడికల్ బయోగ్రఫీగా.. పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? రవితేజకు కలిసొచ్చేలా ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే.. జస్ట్ వాచ్ దిస్ స్టోరీ.టైగర్ నాగేశ్వరరావు అలియాస్ రవితేజ స్టువర్టుపురంలో పుట్టి పెరిగిన వాడు. ఎలాంటి జాలి దయ లేని ఓ నరరూప రాక్షసుడు.
ఎప్పుడూ మాస్ మాసాలా.. సినిమాలు చేసే మాస్ రాజా రవితేజ.. ఆ సారి తన జానర్ మార్చి చేసిన ఫిల్మ్ టైగర్ నాగేశ్వరరావు. వంశీ డైరెక్షన్లో.. పీరియాడికల్ బయోగ్రఫీగా.. పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? రవితేజకు కలిసొచ్చేలా ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే.. జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. టైగర్ నాగేశ్వరరావు అలియాస్ రవితేజ స్టువర్టుపురంలో పుట్టి పెరిగిన వాడు. ఎలాంటి జాలి దయ లేని ఓ నరరూప రాక్షసుడు. అయితే ఆ రాక్షసుడిలో కూడా రాముడు ఉంటాడు. స్టువర్టుపురం ప్రజలకు ఉపాది లేక దొంగతనాలే వృత్తిగా బతుకుంటారు. వాళ్ల మీద పడి పొలిటీషియన్లు, పెత్తందార్లు జీవిస్తుంటారు. అదే సమయంలో ఆ ఊరు బతుకు మార్చాలనుకుంటాడు నాగేశ్వరరావు. దానికోసం ఆయనేం చేసాడు..? మధ్యలో ఆయనకు అడ్డొచ్చిన వాళ్లెవరు..? తను ప్రేమించిన సారా అలియాస్ నుపుర్ సనన్‌ను ఎందుకు దూరం చేసుకున్నాడు..? ఆయన జీవితంలోకి మణి అలియాస్ గాయత్రి భరద్వాజ్ ఎలా వచ్చింది అనేది మిగిలిన కథ.. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు.. ప్రతి కథకు రెండు వర్షన్స్ ఉంటాయి.. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తుంటారు.. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయంలో వంశీ ఇదే చేశాడు.. ప్రపంచానికి కరుడుగట్టిన నేరస్తుడిగా తెలిసిన స్టువర్టుపురం దొంగ జీవితాన్ని.. రాబిన్ హుడ్ అంటూ అతనిలోని మరో కోణాన్ని చేశాడు. రావణుడిలోనూ రాముడు ఉంటాడని చూపించాడు. నాగేశ్వరరావు దొంగతనాలు, హత్యలు చేయడం వరకు తెలిసిన వాళ్లకు.. అసలు ఆయన ఎందుకలా చేయాల్సి వచ్చిందో.. నరరూప రాక్షసుడిగా మారడానికి కారణాలేంటో ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ వంశీ.
ఇక సినిమా పరంగా చూసుకుంటే మాత్రం కంప్లీట్ రాబిన్ హుడ్ స్టోరీ ఇది. పెద్దోన్ని కొట్టు.. పేదోడికి పెట్టు ఫార్ములా.. ఫస్ట్ ఆఫ్ మొత్తం ప్రశ్నలు వేసి.. సెకండ్ హాఫ్ వాటికి సమాధానాలు చెప్పాడు దర్శకుడు వంశీ. ఫస్ట్ ఆఫ్ లో లవ్ ట్రాక్ ఆసక్తికరంగా అనిపించలేదు. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం దిమ్మతిరిగిలా ఉంటాయి. బయోపిక్ కాబట్టి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగానే తీసుకున్న డైరెక్టర్ వంశీ.. ఆ సినిమా కథను ఎంత ఇష్టపడి, స్టడీ చేసి రాసుకున్నాడో సినిమా చూస్తే అర్థమవుతుంది. చిన్న చిన్న డీటైలింగ్ కూడా మిస్ చేయలేదు.. కాకపోతే కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.. ఇక టైగర్ నాగేశ్వరరావు పాత్రకు రవితేజ పూర్తి న్యాయం చేశాడు. ఆ కారెక్టర్‌లో పూర్తిగా లీనం అయిపోయాడు. హీరోయిన్స్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ గ్లామర్ షో మాత్రం బాగానే చేసారు. ఇక చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ ఇందులో నటించారు. ఆమె చేసిన హేమలత లవణం పాత్ర బాగుంది. సోషలిస్ట్ పాత్రలో ఆమె బాగా నటించారు. ఇక వీరి నటనకు తోడు.. జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం బాగుంది. ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకు బలం. మధి చాలా సీన్స్ కెమెరా వర్క్‌తో మరింత రిచ్‌గా చూపించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..