TOP 9 ET: 32.33 కోట్లు..దిమ్మతిరిగే రేంజ్‌లో డే 1 కలెక్షన్స్..మహేష్‌ సినిమా చేయాల్సింది..కానీ..?

TOP 9 ET: 32.33 కోట్లు..దిమ్మతిరిగే రేంజ్‌లో డే 1 కలెక్షన్స్..మహేష్‌ సినిమా చేయాల్సింది..కానీ..?

Anil kumar poka

|

Updated on: Oct 20, 2023 | 10:33 PM

టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్‌.. ఈసినిమా కంటే ముందే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారట. ఆ సినిమాలోని నదియా క్యారెక్టర్‌ తనే ప్లే చేయాల్సిందట. డైరెక్టర్ పరుశురాం కథ చెప్పగానే.. మొదట ఓకే చెప్పినప్పటికీ.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల.. ఈసినిమా నుంచి తప్పుకున్నారట రేణు. అయితే ఇదే విషయాన్ని రీసెంట్‌గా జరిగిన టైగర్ నాగేశ్వరరావు ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పి..

01.Balayya
బాలయ్య భగవంత్‌ కేసరి బాక్సాఫీస్‌ దగ్గర రోరింగ్ చేస్తోంది. సూపర్ డూపర్ హిట్‌ టాక్తో దూసుకుపోతోంది. ఆల్ ఓ వరల్డ్‌ డే1, ఏకంగా 32.33 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో బాలయ్య కలెక్షన్‌ స్టామినా రేంజ్‌.. మరో సారి టాలీవుడ్‌లో రీసౌండ్ చేస్తోంది.

02.Renudesai
టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్‌.. ఈసినిమా కంటే ముందే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారట. ఆ సినిమాలోని నదియా క్యారెక్టర్‌ తనే ప్లే చేయాల్సిందట. డైరెక్టర్ పరుశురాం కథ చెప్పగానే.. మొదట ఓకే చెప్పినప్పటికీ.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల.. ఈసినిమా నుంచి తప్పుకున్నారట రేణు. అయితే ఇదే విషయాన్ని రీసెంట్‌గా జరిగిన టైగర్ నాగేశ్వరరావు ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు రేణు.

03.Leo
విజయ్ లియో సినిమాకు సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు అందరి అంచనాలు నిలబెడుతూ ఈ చిత్రం దాదాపు 120 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. ఫైనల్ ఫిగర్స్ ఇంకా బయటికి రాలేదు. కచ్చితంగా ఆదిపురుష్, జవాన్ సినిమాలను దాటేసి ఉంటుందని అంచనా. వీకెండ్ ముగిసేనాటికి లియో సంచలనాలు ఎలా ఉంటాయో చూడాలి.

04.Sammohanuda
రూల్స్ రంజన్ సినిమాలోని సమ్మోహనుడా పాట ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో అయితే ఈ సాంగ్ రప్ఫాడించింది. AR కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఈ మధ్యే విడుదలై ఫ్లాప్ అయింది. అయితే ఈ చిత్రంలోని ఛార్ట్ బస్టర్ సాంగ్ అయిన సమ్మోహనుడా వీడియో ఇప్పుడు విడుదలైంది.

05.Tiger 3
టైగర్‌ 3 ప్రమోషన్‌ స్పీడు పెంచారు మేకర్స్. రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో వరుస అప్‌డేట్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్, ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. లేకే ప్రభు కా నామ్‌ అనే రొమాంటిక్ సాంగ్‌ను ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు.

06.Valentine
వరుణ్‌ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఏరియల్‌ యాక్షన్ డ్రామా ఆపరేషన్‌ వాలెంటైన్‌. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 8న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

07.Kiara
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా తన ఫిలిం జర్నీ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు కియారా అద్వానీ. సినిమాల ఎంపిక విషయంలో తొలి రోజు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదన్నారు. అయితే గతంలో పోలిస్తే ఇప్పుడు వేగంగా కథలు సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పారు. తన చేసిన ప్రాజెక్ట్స్‌లో లస్ట్ స్టోరీస్‌, కబీర్‌ సింగ్‌ బెస్ట్ క్యారెక్టర్స్ అన్నారు కియారా.

08. Mama Masheendra
సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన సినిమా మామా మశ్చీంద్ర. హర్షవర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమా రెండు వారాల కిందే థియేటర్స్‌లో విడుదలైంది. తాజాగా ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ట్రిపుల్ రోల్ చేసాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో మృణాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించారు.

09. Shilpa Shetty, Raj Kundra
ముంబై వీధుల్లో కొన్నేళ్లుగా మాస్క్ వేసుకుని క‌నిపించిన వ్య‌క్తి రాజ్ కుంద్రా. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త ఈయన. ఆ మధ్య బ్లూ ఫిల్స్ కేసులో బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి కుంద్రా అలాగే తిరుగుతున్నా డు. ఈనేప‌థ్యంలోనే ట్వీట్‌లో విడాకులు అంటూ ప్రస్థావించాడు.. అయితే ఆయన విడిపోయేది మాస్క్‌తోనా లేదంటే శిల్పాతోనా అనేది సస్పెన్స్ మెయింటేన్ చేసి ఆ తర్వాత మాస్క్‌కు దూరం అవుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక తన బయోపిక్‌లో తానే నటిస్తున్నాడు. దానికి UT69 టైటిల్ పెట్టారు రాజ్‌ కుంద్రా

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..